iDreamPost
android-app
ios-app

తెలంగాణ DSC నియామక పరీక్ష వాయిదా!

తెలంగాణ DSC నియామక పరీక్ష వాయిదా!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 30న తెలంగాణలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతుండటంతో పలు ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలపై దాని ప్రభావం పడింది. గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. కొత్త పరీక్ష తేదీలను కూడా వెల్లడించింది.

నిన్నటి వరకు తెలంగాణ డీఎస్సీ పరీక్షల విషయంలో సందిగ్ధత నెలకొని ఉండింది. శుక్రవారం మధ్యాహ్నం డీఎస్సీ పరీక్షలపై క్లారిటీ వచ్చింది. విద్యాశాఖ డీఎస్సీ నిమాయక పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కారణంగా పరీక్షల్ని వాయిదా వేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. డీఎస్సీ పరీక్షలకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. కాగా, 5,089 పోస్టులకు గానూ సెప్టెంబర్‌ 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. నవంబర్‌ 20 నుంచి 30 వరకు పరీక్షలు జరగాల్సి ఉండింది. ఎన్నికల కారణంగా పరీక్షల తేదీలు నవంబర్‌నుంచి వాయిదా పడ్డాయి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet