SNP
TS Election Results 2023, DGP Anjani Kumar: ఒక వైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతూ.. అంతా హడావిడిగా ఉంటే.. మరోవైపు ఎన్నికల సంఘం తెలంగాణ డీజీపీపై వేటు వేసింది. అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
TS Election Results 2023, DGP Anjani Kumar: ఒక వైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతూ.. అంతా హడావిడిగా ఉంటే.. మరోవైపు ఎన్నికల సంఘం తెలంగాణ డీజీపీపై వేటు వేసింది. అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఒక వైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వెళ్లి కలవడంతో.. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. డీజీపీ చేసిన పని ఎన్నికల విధుల ధిక్కరణ కిందికి వస్తుందని పేర్కొంటూ.. ఈసీ ఈ సస్పెషన్ వేటు వేసింది. డీజీపీ అంజనీకుమార్ తో పాటు మరికొంత మంది పోలీస్ అధికారులు.. మర్యాదపూర్వకంగా వెళ్లి రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో కలుసుకున్నారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో.. పూర్తి స్థాయిలో ఫలితాలు రాకముందే.. ఒక పార్టీ నాయకుడిని వెళ్లి ఎలా కలుస్తారనే విమర్శలు కూడా ఎదురయ్యాయి.
వీటిని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం అధికారాలు ఏకంగా రాష్ట్ర డీజీపీపై వేటు వేస్తూ.. ఉత్తర్వుల జారీ చేశారు. కాగా.. కొత్త ఏర్పాటు కాబోతుందని తెలియడంతో.. పోలీసులు కాస్త అత్యుత్సాహం చూపించారని కూడా సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. డీజీపీ సస్పెషన్ గురించి అటుంచితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుని అధికారం చేపట్టే దిశగా దూసుకెళ్తోంది. మొత్తంగా 64 సీట్లు కాంగ్రెస్‌కు, 39 సీట్లు బీఆర్‌ఎస్‌కు, 8 సీట్లు బీజేపీకి, 7 సీట్లు ఎంఐఎంకు వచ్చే అవకాశం ఉంది. వీటిలో కొన్ని స్థానాల్లో ఇప్పటికే ఫలితాలు వెలువడగా.. మరిన్ని స్థానాల్లో ఆయా పార్టీలు లీడ్‌లో ఉన్నాయి. మరి ఈ ఫలితాలు పూర్తికాక ముందే.. వెళ్లి రేవంత్ రెడ్డిని డీజీపీ కలవడం, ఆయనపై ఈసీ వేటు వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.