Nidhan
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో ఉంది. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దీని నుంచి సిటీ ప్రజలు బయటపడటం కష్టమే.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో ఉంది. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దీని నుంచి సిటీ ప్రజలు బయటపడటం కష్టమే.
Nidhan
తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చాలా విషయాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే భాగ్యనగరం ముందంజలో ఉంది. అందుకే ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ప్రజలు హైదరాబాద్‌కు వలస వస్తున్నారు. అయితే నంబర్ వన్ సిటీగా నిలవాలని అనుకుంటున్న మన నగరానికి తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. సౌతిండియాలోని మెట్రో సిటీస్‌లో అత్యధిక కాలుష్యం ఉన్న నగరంగా హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ విషయం గ్రీన్ పీస్ ఇండియా అధ్యయనంలో వెల్లడైంది.
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి లాంటి సౌతిండియన్ మెట్రో సిటీస్‌లో వాయు కాలుష్యం స్థాయులు తెలుసుకునేందుకు గ్రీన్ పీస్ ఇండియా ఓ సర్వే చేపట్టింది. ఇందులో ఇతర నగరాల కంటే భాగ్యనగరంలోనే వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బెంగళరు, కొచ్చి, చెన్నైతో కంపేర్ చేస్తే హైదరాబాద్‌లో 2.5 పీఎం కాలుష్య కారకాలు అధికంగా ఉన్నాయని బయటపడింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొన్న ప్రమాణాల కంటే 14 రెట్లు ఎక్కువగా మన సిటీలో కాలుష్యం విడుదల అవుతోంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లోనూ కాలుష్య నగరాల లిస్టులో భాగ్యనగరం చేరడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్‌లో వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల జాబితాలో బంజారాహిల్స్, కేపీహెచ్‌బీ ముందున్నాయి.
బంజారాహిల్స్‌లో 127 ఏక్యూఐ, కేపీహెచ్బీలో 124, జూపార్కు ఏరియాలో 144, సైదాబాద్‌లో 100 ఏక్యూఐకి వాయు కాలుష్యం చేరింది. ఇండస్ట్రీలు ఎక్కువగా ఉన్న మల్లాపూర్, నాచారం, బాలానగర్, పటాన్చెరు, పాశమైలారం ఏరియాల్లో కూడా ఎయిర్ పొల్యూషన్ అనూహ్యంగా పెరిగింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత కోల్‌కతా, హైదరాబాద్ ఉన్నాయి. ఆర్థిక రాజధాని ముంబై కంటే భాగ్యనగరంలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉండటం గమనార్హం. మన సిటీలో రోజుకు 7 వేల మెట్రిక్ టన్నుల చెత్త విడుదల అవుతుండటంతో కాలుష్యం పెరుగుతోంది.
హైదరాబాద్ నగర శివార్లలో డంపింగ్ యార్డ్ నుంచి తీవ్ర దుర్గంధం వెలువడుతోంది. నాలుగు వైపులా శరవేగంగా విస్తరిస్తున్న సిటీలో జనాభాతో పాటు వెహికిల్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే మన సిటీలో 70 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే పొగ కాలుష్యం పెరగడానికి కారణం అవుతోంది. రోడ్లు, భవన నిర్మాణాలు కూడా వాయు కాలుష్యం ఈ స్థాయికి చేరడానికి ఒక కారణమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఐదేళ్లలో నగరంలో కాలుష్యం మరింత పెరిగి చివరికి ముక్కు మూసుకొని జీవనం గడిపే సిచ్యువేషన్ రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. హైదరాబాద్‌ను కాలుష్యం బారి నుంచి బయట పడేయాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: భిక్షం అడిగినందుకు ప్రాణాలు తీశాడు.. వీడియో వైరల్