తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. హైడ్రా ఇక తగ్గేదేలా.. ఇకపై మరింత పవర్ ఫుల్

HYDRA: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు మరిన్ని పవర్స్ కల్పిస్తూ నిర్ణయించింది. దీంతో హైడ్రా మరింత పవర్ ఫుల్ గా పనిచేసేందుకు అవకాశం కల్పించినట్లైంది.

HYDRA: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు మరిన్ని పవర్స్ కల్పిస్తూ నిర్ణయించింది. దీంతో హైడ్రా మరింత పవర్ ఫుల్ గా పనిచేసేందుకు అవకాశం కల్పించినట్లైంది.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూములు, కుంటలు, నాళాల చెరువుల పరిరక్షణ కోసం హైడ్రాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ లో ఉన్న భూములను రక్షించేందుకు హైడ్రా ఏర్పాటు చేయబడింది. హైడ్రా అమల్లోకి వచ్చాక నగరంలో అక్రమంగా స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ప్రభుత్వ స్థలాలను రక్షిస్తూ ఆక్రమణదారుల పాలిట ఉక్కుపాదం మోపుతున్నది. హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తుండడంతో ప్రజలు, ప్రతి పక్షాల నుంచి మద్దతు లభించింది.

ఈ నేపథ్యంలో హైడ్రాను మరింత పవర్ ఫుల్ గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు విస్తృత అధికారులు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై హైడ్రాకు మరిన్ని పవర్స్ కల్పించి.. పూర్తి స్వేచ్ఛగా పని చేసుకునేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇకపై హైడ్రా మరింత పవర్ ఫుల్ గా పనిచేయనున్నది. భవనాలకు సంబంధించిన అనుమతులు ఇచ్చే అధికారం హైడ్రాకు రానున్నట్లు తెలుస్తోంది. హైడ్రాకు కల్పించిన పవర్స్ తో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

హైదరాబద్ లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఎకరాలకు ఎకరాలు అక్రమదారుల చేతుల్లో ఉండిపోయింది. ఈ సమస్య పరిష్కారానికి రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా ఛార్జ్ తీసుకున్న వెంటనే అక్రమ నిర్మాణాలకు నోటీసులిస్తూ కూల్చివేతలు ప్రారంభించింది. ఈ క్రమంలో సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూడా కూల్చివేసింది. దీంతో హైడ్రా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. హైడ్రా పనితీరుతో సత్ఫలితాలు వస్తుండడంతో పక్క రాష్ట్రాలు సైతం ఇలాంటి విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి. దీనితో పాటుగా రాష్ట్రంలోని మూడు యూరివర్శిటీల పేరు మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు, టెక్స్ టైల్ అండ్ హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపుజి పేరు పెట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్‎ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Show comments