iDreamPost
android-app
ios-app

‘కంది’ రైతు పంట పండింది.. రికార్డ్‌ స్థాయిలో ధర.. క్వింటా ఎంతంటే

  • Published Apr 24, 2024 | 10:07 AM Updated Updated Apr 24, 2024 | 10:07 AM

Kandi Pappu: ఈ ఏడాది కంది పంట పండించిన రైతుల పంట పండింది. రికార్డ్‌ స్థాయిలో ధర పలికి.. అన్నదాతలను లక్షాధికారులను చేసింది. ఆ వివరాలు..

Kandi Pappu: ఈ ఏడాది కంది పంట పండించిన రైతుల పంట పండింది. రికార్డ్‌ స్థాయిలో ధర పలికి.. అన్నదాతలను లక్షాధికారులను చేసింది. ఆ వివరాలు..

  • Published Apr 24, 2024 | 10:07 AMUpdated Apr 24, 2024 | 10:07 AM
‘కంది’ రైతు పంట పండింది.. రికార్డ్‌ స్థాయిలో ధర.. క్వింటా ఎంతంటే

సాధారణంగా రైతులు లాభపడటం చాలా అరుదుగా జరుగుతుంది. ప్రభుత్వాలతో పాటు ప్రకృతి కూడా అన్నదాతను మోసం చేస్తుంది. పంటలు బాగా పండిన ఏడాదేమో మద్దతు ధర లభించదు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చిన ఏడాది కరువు, అకాల వర్షాలు రైతన్న కంట్లో కారం కొడతాయి. అ‍న్నదాతలు లాభాలు చవి చూసేది ఎప్పుడో ఒక్కసారి మాత్రమే. రెండేళ్ల క్రితం టమాటకు భారీగా ధర పలకడంతో.. చాలా మంది రైతులు లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు. ఆ తర్వాత అన్నదాతలకు అంత భారీ ఎత్తున లాభాలు తెచ్చిన పంటలు లేవు. పైగా గతేడాది వర్షాభావం కారణంగా రైతులు చాలా నష్టపోయారు. అయితే అనూహ్యంగా ఈ ఏడాది కంది పంట పండించిన రైతుల పంట పండింది. రికార్డు స్థాయిలో భారీ ధర పలుకుతుంది. ఆ వివరాలు..

ఈ ఏడాది కంది పంట పండించిన రైతుల పంట పండింది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఈ ఏడాదిలోనే అత్యధిక ధర పలికింది. కంది పంటకు రాష్ట్రంలోని అన్ని మార్కెట్‌లలోకెల్లా సూర్యాపేటలోనే రికార్డు ధర పలకింది. ఇక్కడ నాణ్యతగల కందులకు కింట్వా రూ.11,246 ధర చెల్లించి మరీ వ్యాపారులు కొనుగోలు ఏశారు. ఈ ఏడాదికి ఇదే అత్యధిక ధర అని చెబుతున్నారు. పది క్వింటాళ్ల కందులు అమ్మితే లక్షాధికారులు అవుతున్నారు. మంగళవారం రైతులు సూర్యపేట మార్కెట్‌కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలకటం విశేషం. కందులకు అత్యధిక ధర పలకటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. రైతులు నాణ్యమైన పంట ఉత్పత్తులు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా మార్కెట్‌ అధికారులు కోరుతున్నారు

కాగా, తాండూరు కందిపప్పుకు ఈ ఏడాది మార్చిలో మంచి ధర పలికింది. నాణ్యత గల కందులను వ్యాపారులు రూ.11,007 ధర చెల్లించి కొనుగోలు చేశారు. నాసిరకంగా ఉన్న కందులకు రూ.8,811 చొప్పున, నాణ్యతకు కాస్త అటూ ఇటుగా ఉన్న కందులకు రూ.10,125 చొప్పున ధర చెల్లించి అన్నదాతల వద్ద నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం క్వింటాలు కందులకు రూ.7 వేల మద్దతు ధర ప్రకటించింది. అయితే వ్యాపారులు మాత్రం మద్దతు ధర వద్ద రూ.1,811 నుంచి రూ.4,007 అధికంగా చెల్లించటం విశేషం. అయితే ఆ రికార్డు ధరను తాజాగా సూర్యాపేట మార్కెట్ యార్డులో వ్యాపారులు బద్దలు కొట్టారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş