గేటుకు తాళం వేసి ఎండలో విద్యార్థులను నిలబెట్టిన శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం

పిండి కొద్దీ రొట్టె సామెతను నమ్మి మోసపోతున్నారు పేరెంట్స్. ఫీజుల రూపంలో ఎన్ని లక్షల డబ్బులు కట్టించుకుంటే అంత క్వాలిటీ విద్యను ఇస్తున్నారని నమ్మి... ప్రైవేట్ స్కూళ్లలో పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. అప్పుడు కానీ తెలియడం లేదు వాటి అసలు రంగు.

పిండి కొద్దీ రొట్టె సామెతను నమ్మి మోసపోతున్నారు పేరెంట్స్. ఫీజుల రూపంలో ఎన్ని లక్షల డబ్బులు కట్టించుకుంటే అంత క్వాలిటీ విద్యను ఇస్తున్నారని నమ్మి... ప్రైవేట్ స్కూళ్లలో పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. అప్పుడు కానీ తెలియడం లేదు వాటి అసలు రంగు.

పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు లక్షలు లక్షలు డోనేషన్లు, ఫీజులు కట్టి ప్రైవేట్ బడుల్లో జాయిన్ చేస్తారు. ఎన్ని లక్షలు ఫీజు ఉంటే అంత బాగా చెబుతారన్న అపోహ పేరెంట్స్‌కు ఉంది. వీరి నమ్మకాన్ని పెట్టుబడిగా చేసుకున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం.. విద్యార్థుల తల్లిదండ్రులను నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తోంది. క్వాలిటీ విద్యను పక్కన పెడితే.. స్కూల్లో పిల్లల్ని చేర్చేంత వరకు ఓ మాట, చేర్చిన తర్వాత మరో మాట మాట్లాడుతుంటారు. వీరి నిర్లక్ష్యం కారణంగా స్టూడెంట్స్, పేరెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు. తాజాగా ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాకం బయటకు వచ్చింది.  స్కూల్ యాజమాన్యం చేసిన తప్పుకు పిల్లలు బలి కావాల్సి వచ్చింది.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని గూపన్ పల్లిలో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థులు మండుటెండలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. యధావిధిగా బుధవారం పాఠశాలకు వెళ్లారు విద్యార్థులు. అయితే పాఠశాలకు తాళం వేసి ఉంది. తెరుస్తారన్న ఉద్దేశంతో అక్కడే ఎండలో ఉండిపోయారు విద్యార్థులు. ఎంతకు తీయకపోవడంతో పిల్లలను తీసుకు వచ్చిన పేరెంట్స్ ఫోన్స్ చేసి అడగ్గా..‘ మా ఇష్టం.. పిల్లలకు సెలవులు ఇస్తాం’ అంటూ సమాధానం ఇచ్చారు యాజమానులు. కానీ తీరా తెలిసిన విషయం ఏంటంటే.. మూడు ఏళ్లుగా స్కూల్ రన్ చేస్తున్న బిల్డింగ్‌కు రెంట్ కట్టడం లేదని.

రెంటల్ విధానంలో ఓ బిల్డింగ్ తీసుకుంది శ్రీ చైతన్య స్కూల్ యజమాన్యం. అయితే కరోనా సమయం నుండి ఆ బిల్డింగ్ ఓనరుకు డబ్బులు చెల్లించడం లేదు. దీంతో పాఠశాలకు తాళం వేశారు. ఈ విషయం తెలియని పేరెంట్స్ పిల్లలను స్కూల్ దగ్గరకు తీసుకు వచ్చారు. విద్యార్థులు కూడా వచ్చి గేట్ ముందు పడిగాపులు పడ్డారు. లాక్ తీస్తారన్న ఉద్దేశంతో ఎండలో అలాగే ఉండిపోయారు. స్కూల్ లేదని ఎలాంటి మేసెజ్ కానీ యాజమాన్యం ఇవ్వకపోవడంతో ఎప్పటికైనా తీస్తారన్న ఉద్దేశంతో అక్కడే నిలబడ్డారు విద్యార్థులు. చివరకు కొంత మంది పేరెంట్స్ ఫోన్ చేసి అడిగితే మా ఇష్టం అని మాట్లాడగా.. సీరియస్ అవుతున్నారు పేరెంట్స్. స్కూల్లో చేర్పించేటప్పుడు అన్నీ మెసేజెస్ రూపంలో వస్తాయని లక్షల కొద్దీ ఫీజులు వసూలు చేశారు.. ఇప్పుడేమో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు.

Show comments