రైల్వే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్… 80 రైళ్లు రద్దు! వివరాలు ఇవే!

South Central Railway: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. భారీ వర్షాల కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఏకంగా 80 రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

South Central Railway: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. భారీ వర్షాల కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఏకంగా 80 రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గత మూడు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి. ఇక శని,  ఆదివారం కురిసిన వానలకు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికాయి. విజయవాడ నగరం అయితే జలమయం అయింది. చాలా కాలనీలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్స్ బాగా దెబ్బతిన్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రైల్వే మార్గలు దెబ్బతిన్నాయి. ఇక ఈ భారీ వర్షాల కారణంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ప్రయాణికులకు బిగ్ అలెర్ట్ అనే చెప్పొచ్చు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు  పలు రైళ్లను రద్దు చేశారు. ఈ డివిజన్ పరిధిలోని 80 రైళ్లను  రద్దు చేశారు.  అలానే 49 రైళ్లను దారి మళ్లించారు. మరో 5 ట్రైన్స్ ను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక రైల్వే శాఖ తెలిపిన వివరాలను చూసి.. ప్రయాణికులు తమ జర్నీకి ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇక రద్దైన ట్రైన్స్ వివరాలు చూసినట్లు అయితే… విజయవాడ- సికింద్రాబాద్, గుంటూరు, సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లు. అలాగే విశాఖ-హైదరాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727, 12728), విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (20708), విశాఖ- లోకమాన్య తిలక్‌ టెర్మినల్ (ఎల్‌టీటీ ఎక్స్‌ ప్రెస్‌) (18519) ను రద్దు అయ్యాయి.

అలానే విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య నడిచే గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ (127739, 12740), విశాఖ-సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ (22203), విశాఖ-సికింద్రాబాద్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (12783), నాందేడు నుంచి విశాఖ మధ్య నడిచే సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (20812), మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17219), విశాఖ-మహబూబ్ నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12861) రద్దు అయ్యాయి. అదే విధంగా హైదరాబాద్‌-షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (18046), సికింద్రాబాద్‌-హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ ప్రెస్‌ (12704), మహబూబ్‌నగర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (12862)‌ ట్రైన్స్ రద్దైన వాటిలో ఉన్నాయి.

వీటితో పాటు సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచి కొన్నిట్రైన్లు, కాకినాడ పోర్టు నుంచి లింగంపల్లి, గూడురూ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లు రద్దయ్యాయి. విజయవాడ, భద్రాచలం రోడ్డు మార్గాల్లో  నడుస్తున్న రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇవే కాక పలు ట్రైన్లు రద్దయ్యాయి. వివరాలు తెలుసుకునేందుకు రైల్వే శాఖ వెబ్ సైట్ ను సందర్శించండి.

మరోవైపు వర్షాల ప్రభావం, రైలు మార్గల పరిస్థితిపై రైల్వే అధికారులు వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రైళ్ల పునరుద్ధరణ, భద్రతాపరమైన చర్యలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్లలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటుచేశారు. విశాఖ 0891-2746330, 0891-2744619 సంప్రదించాలి. ఆదివారం, సోమవారం కలిపి మొత్తం 80 రైళ్లు రద్దు చేశారు. అలానే మరో 48 రైళ్లను దారి మళ్లించారు. హైదరాబాద్‌, విజయవాడ మార్గంలో ఎక్కువ ట్రైన్స్ రద్దయ్యాయి. ఈ రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ప్రయాణికులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.  ప్రయాణికుల భద్రత కోసమే రైళ్లను రద్దు చేశామని ఆయన వివరించారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అధికారులకు రైల్వే శాఖ అదేశాలు జారీ చేసింది.

Show comments