Video: క్షణాల్లో ఎంత ఘోరం.. నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి!

హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎప్పటిలాగే జిమ్ చేసుకుని ఇంటికి వస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. నిర్లక్ష్యంగా తెరిచిపెట్టిన నీటి సంపును గమనించకుండా పోవడంతో తిరిగి రాని లోకానికి వెళ్లిపోయాడు.

హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎప్పటిలాగే జిమ్ చేసుకుని ఇంటికి వస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. నిర్లక్ష్యంగా తెరిచిపెట్టిన నీటి సంపును గమనించకుండా పోవడంతో తిరిగి రాని లోకానికి వెళ్లిపోయాడు.

ప్రమాదం అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరం, చెప్పలేము. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది. అలానే కొందరి నిర్లక్ష్యపు పనుల కారణం  అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా హాస్టల్ ఓనర్ నిర్లక్ష్యానికి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌ కొండాపూర్‌లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మం జిల్లా ఇల్లెందుకు ప్రాంతానికి చెందిన అక్మల్ అనే యువకుడు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొండాపూర్‌లోని ఓ హాస్టల్‌లో ఆ యువకుడు ఉంటున్నాడు. అక్మల్ కి రోజు జిమ్ చేసే అలవాటు ఉంది. అందుకే రోజూ బయటకు వెళ్లి జిమ్ చేసి.. తిరిగి హాస్టల్ కి వస్తుంటాడు. అదే విధంగా రోజూ మాదిరిగానే ఆదివారం కూడా అక్మల్ జిమ్ చేసి తిరిగి హాస్టల్‌కు వస్తున్నాడు. అక్మల్ గేట్ తీసుకుని లోపలికి వస్తున్న సమయంలో..కిందికి గమనించకుండా లోపలికి నడిచాడు. అయితే.. ఆ  మార్గంలోనే నీటి సంపు తెరిచి ఉంది.

దానిని చూసుకోకుండా అక్మల్ ముందుకు నడవటంతో ఒక్కసారిగా అందులో పడిపోయాడు. ఈ క్రమంలో అతని తలకు బలమైన గాయం కావటంతో.. అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే అక్మల్ పడిపోయిన విషయాన్ని కాసేపటి తరువాత హాస్టల్ యజమాని గమనించాడు. అతడి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హాస్టల్ ఓనర్ ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అక్మల్ మృతదేహాన్ని సంపు నుంచి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇక్కడ హాస్టల్ ఓనర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. సీసీ కెమెరా దృశ్యాలు చూస్తుంటే.. యక్మల్ సంపులో పడిన వెంటనే యజమాని స్పందించలేదని అర్థమవుతోంది. యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడే ఉన్న సీసీ కెమెరా వీడియోలు పరిశీలించగా.. అక్మల్ చూసుకోకుండా ముందుకు నడుస్తుండటంతో.. అప్పటికే తెరిచి ఉన్న సంపులో పడిపోయినట్టుగా అందులో కనిపించింది. అలానే అక్మల్ సంపులో పడిన వెంటనే యజమాని స్పందించలేదని అందులో కనిపిస్తోంది. అదే విధంగా సంపు ఓపెన్ లో ఉన్నట్లు ఎలాంటి సైన్ బోర్డు కూడా లేకపోవటంతోనే.. ఎప్పటిలాగే అక్మల్ నడుచుకుంటూ వెళ్లి..అందులో పడిపోయాడు. మొత్తంగా యజమాని నిర్లక్ష్యం వల్లే.. అక్మల్ మృతి చెందినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. పస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments