iDreamPost
android-app
ios-app

Sirish Bharadwaj: శిరీష్ భరద్వాజ్ మృతి.. కారణం ఏమిటంటే!

  • Published Jun 19, 2024 | 11:37 AM Updated Updated Jun 19, 2024 | 11:39 AM

తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శిరీష్‌ భరద్వాజ్‌ కన్ను మూశాడు. ఆ వివరాలు..

తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శిరీష్‌ భరద్వాజ్‌ కన్ను మూశాడు. ఆ వివరాలు..

  • Published Jun 19, 2024 | 11:37 AMUpdated Jun 19, 2024 | 11:39 AM
Sirish Bharadwaj: శిరీష్ భరద్వాజ్ మృతి.. కారణం ఏమిటంటే!

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మాజీ భర్త శిరీష్‌ భరద్వాజ్‌ మృతి చెందాడు. ఇతడు గతంలో శ్రీజను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అభిప్రాయ బేధాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. వీరికి ఒక కుమార్తె సంతానం. ఇదిలా ఉండగా తాజాగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శిరీష్‌ భరద్వాజ్‌ మృతి చెందాడని తెలుస్తోంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భరద్వాజ్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలుస్తోంది. భరద్వాజ్‌ గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం ఉదయం కన్ను మూశాడు. అయితే దీనిపై అతడి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. 2007లో వీరిద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ వీరు పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. కానీ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. 2014లో వీరిద్దరూ విడిపోయారు. అప్పటికే వీరికి ఒక కుమార్తె పుట్టింది. ఇ​క శిరీష్ భరద్వాజ్ 2019లో మరో వివాహం చేసుకున్నాడు. అనంతరం బీజేపీలో చేరి రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. ఇక గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శిరీష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్ను మూశాడు.

ఇక శ్రీజతో విడాకులు తర్వాత శిరీష్‌ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ విహనను వివాహం చేసుకున్నాడు. 2019లో వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం వారు చెన్నైలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్నాళ్ల క్రితం లంగ్‌ సమస్య బారిన పడ్డాడని.. దానికి చికిత్స తీసుకుంటున్నాడని తెలుస్తోంది. దీనిపై శిరీష్‌ కుటుంబ సభ్యులు స్పందిస్తే.. మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.