iDreamPost

తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన యువతులు.. చిన్న కారణానికే

ఇద్దరు విద్యార్థినులు చిన్న వయసులోనే షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. చిన్న కారణానికే దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

ఇద్దరు విద్యార్థినులు చిన్న వయసులోనే షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. చిన్న కారణానికే దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన యువతులు.. చిన్న కారణానికే

ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలతో షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. బాగా చదువుకుని తమకు అండగా ఉంటారనుకున్న తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ ఎదురవుతున్నది. ప్రేమ వ్యవహారాలు, కుటుంబకలహాలతో దారుణాలకు పాల్పడుతున్నారు. చదువులో రాణించకున్నా.. పరీక్షల్లో మార్కులు తగ్గినా.. ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్ అయినా కూడా ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు యువతులు చిన్న కారణానికే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. కన్న తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చారు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

ఇటీవల ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కు సంబంధించిన ఫలితాలు నిన్న సోమవారం నాడు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మళ్లీ ఫెయిల్ అవడంతో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిరిసిల్ల తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తోకల సోనీ నిన్న ప్రకటించిన ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మానసికంగా కుంగిపోయింది. మనస్తాపం చెందిన సోని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోని మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కరీంనగర్ – జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన శ్యామల వైష్ణవి ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైంది.

దీంతో మనస్తాపం చెంది ఈనెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా అక్కడ చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి నిన్ని తుదిశ్వాస విడిచింది. ఇంటర్ లో ఫెయిల్ అయిన కారణంగా ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది. కూతుర్ల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి