iDreamPost
android-app
ios-app

పోలీసుల కోసం ప్రత్యేక మార్ట్.. ఎక్కడో కాదు మన దగ్గరే!

  • Published Jan 27, 2024 | 8:33 AM Updated Updated Jan 27, 2024 | 8:36 AM

Special Mart For Police: పోలీసుల కోసం ప్రత్యేక మార్ట్ ను ప్రారంభించారు జిల్లా కలెక్టర్. ఈ మార్ట్ లో పోలీసు సిబ్బందికి వస్తువులపై 20 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.

Special Mart For Police: పోలీసుల కోసం ప్రత్యేక మార్ట్ ను ప్రారంభించారు జిల్లా కలెక్టర్. ఈ మార్ట్ లో పోలీసు సిబ్బందికి వస్తువులపై 20 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.

  • Published Jan 27, 2024 | 8:33 AMUpdated Jan 27, 2024 | 8:36 AM
పోలీసుల కోసం ప్రత్యేక మార్ట్.. ఎక్కడో కాదు మన దగ్గరే!

సమాజంలో శాంతి, భద్రతలను పరిరక్షించడంలో పోలీసులది కీలక పాత్ర. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి.. తమ డ్యూటీని నిర్వహిస్తూ ఉంటారు పోలీసులు. ఇక వీరి కోసం ప్రభుత్వాలు పలు రకాల సేవలను అందిస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. తాజాగా పోలీసుల కోసం ప్రత్యేక మార్ట్ ను ప్రారంభించారు జిల్లా కలెక్టర్. ఈ మార్ట్ లో పోలీసు సిబ్బందికి వస్తువులపై 20 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇంతకీ ఈ మార్ట్ ఎక్కడో లేదు.. తెలంగాణలోనే ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పోలీసుల కోసం ప్రత్యేక మార్ట్ ను ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ గా ఈ మార్ట్ ను స్టార్ట్ చేశారు. ఇందులో వస్తువులు కొనుగోలు చేసిన పోలీస్ సిబ్బందికి 20 నుంచి 40 శాతం వరకు రాయితీ కూడా లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. మార్ట్ లో నిత్యవసర సరకులతో పాటుగా ఎలక్ట్రానికి వస్తువులు కూడా ఉన్నాయి. తక్కువ ధరతో పాటుగా డిస్కౌంట్ కూడా లభిస్తోందని, దీంతో.. జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మార్ట్ ను ప్రారంభించిన అనంతరం దానికి సంబంధించిన ప్రత్యేకతలను అధికారులు ఆమెకు వివరించారు. ఎస్పీ కార్యాలయంలోనే ఈ మార్ట్ ను ఏర్పాటు చేయడంతో.. పోలీసులకు అందుబాటులో ఉంటుంది. మరి డిపార్ట్ మెంట్ కోసం ప్రత్యేకంగా మార్ట్ ను ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio