iDreamPost
android-app
ios-app

సజ్జనార్‌ని కదిలించిన అంధ యువకుడి పాట.. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండంటూ

  • Published Nov 11, 2024 | 2:33 PM Updated Updated Nov 11, 2024 | 2:33 PM

TS RTC MD Sajjanar: ఆర్టీసీ బస్సులో అంధ యువకుడు పాడిన పాట నెట్టింటా వైరల్ గా మారింది. చూపులేని యువకుడి పాట సజ్జనార్ ని కదిలించింది. అతనికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండంటూ మ్యూజిక్ డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేశాడు.

TS RTC MD Sajjanar: ఆర్టీసీ బస్సులో అంధ యువకుడు పాడిన పాట నెట్టింటా వైరల్ గా మారింది. చూపులేని యువకుడి పాట సజ్జనార్ ని కదిలించింది. అతనికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండంటూ మ్యూజిక్ డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేశాడు.

  • Published Nov 11, 2024 | 2:33 PMUpdated Nov 11, 2024 | 2:33 PM
సజ్జనార్‌ని కదిలించిన అంధ యువకుడి పాట.. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండంటూ

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. కానీ, అది బయటపడడానికి కాస్త టైమ్ పడుతుంది. ఎవరిలో ఏ టాలెంట్ దాగి ఉందో చెప్పడం కష్టం. అందుకే టాలెంట్ ఎవరి సొత్తు కాదంటుంటారు. కొందరు గేమ్స్ బాగా ఆడుతారు, అద్భుతంగా డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ అబ్బురపరుస్తుంటారు. మరికొందరు సరికొత్త ఆవిష్కరణలు చేస్తుంటారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా తమ టాలెంట్ చూపిస్తుంటారు. టాలెంట్ కు అంగవైకల్యం అడ్డుకాదని నిరూపిస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక టాలెంట్ బయటపెట్టుకునేందుకు చక్కటి వేదిక లభించినట్లైంది. తాజాగా ఓ యువకుడు కళ్లు లేకపోయినా ఫంటాస్టిక్ గా పాట పాడుతూ నెటిన్ల హృదయాలను దోచేశాడు.

చూపు లేకపోయినా తన గాన మాధూర్యంతో కట్టిపడేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. అయితే ఈ అంధ యువకుడు పాడిన పాట తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కంట పడింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సజ్జనార్ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. అంతే కాదు ఆ యువకుడికి ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ప్రముక మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిని కోరాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. అతనికి చూపు లేదు. అయితేనేం ఆయన గొంతులో అధ్బుతమైన మాధూర్యం ఉంది. కళ్లు లేని ఆ యువకుడు శ్రీ ఆంజనేయం సినిమాలోని రామ రామ రఘురామ పాటతో అదరగొట్టాడు.

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ.. అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా అంటూ అంధ యువకుడు తన గానంతో రంజింపచేశాడు. అతడి పాటకు బస్సులోని ప్రయాణికులు ముగ్థులయ్యారు. చప్పట్లతో అతడిని ప్రశంసించారు. యువకుడి టాలెంట్ కు అంతా మెచ్చుకున్నారు. కాగా అంధ యువకుడు పాడిన ఈ పాటను ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఒళ్లు పులకరించి పోయేలా పాడడంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియో సజ్జనార్ చెంతకు చేరింది. యువకుడి పాటతో పరవశించిపోయిన ఆయన ఎక్స్ వేదికగా స్పందించాడు. అంధుడు పాడిన పాట సజ్జనార్ ను కదిలించింది.

అతన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ‘మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా. ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్’ అని రాసుకొచ్చారు. దీన్ని చూసిన నెటిజన్లు అమేజింగ్ టాలెంట్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వారికి అవకాశాలు ఇవ్వాలంటూ కోరుతున్నారు. మరి అంధ యువకుడు అద్భుతంగా పాట పాడిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom