నిమ్స్ లో పిల్లలకు రూ.50 లక్షల వరకు ఉచిత వైద్యం

Hyderabad: చాలామంది పిల్లలు పుట్టుకతోనే అరుదైన వైద్యుల బారిన పడుతుంటారు. అయితే అలాంటి చిన్నారులకు ఖరీదైన చికిత్స చాలా అవసరం. కానీ, అది అందరికీ సాధ్యపడదు. దీంతో చాలామంది చిన్నారులు సరైనా చికిత్స అందక, ఎదుగుదల లేక మరణిస్తుంటారు. అయితే ఇక మీదట చిన్నారులకు అలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదనే నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి శుభవార్త చెప్పింది. ఇంతకీ అదేమిటంటే..

Hyderabad: చాలామంది పిల్లలు పుట్టుకతోనే అరుదైన వైద్యుల బారిన పడుతుంటారు. అయితే అలాంటి చిన్నారులకు ఖరీదైన చికిత్స చాలా అవసరం. కానీ, అది అందరికీ సాధ్యపడదు. దీంతో చాలామంది చిన్నారులు సరైనా చికిత్స అందక, ఎదుగుదల లేక మరణిస్తుంటారు. అయితే ఇక మీదట చిన్నారులకు అలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదనే నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి శుభవార్త చెప్పింది. ఇంతకీ అదేమిటంటే..

ప్రస్తుత కాలంలో ఏ జబ్బులు ఎలా వస్తున్నయో అర్ధం కావడం లేదు. పైగా వాటిలో డాక్టర్స్ కు కూడా అంతుచిక్కని వ్యాధులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ రకంగా అరుదైన వ్యాధుల బారినపడిన వారిలో.. ఎక్కువ శాతం చిన్నారులే ఉండటం గమనర్హం. చాలామంది చిన్నారుల పుట్టుకతోనే అరుదైన వైద్యుల బారిన పడుతుంటారు. అది గుండె,జెనెటిక్‌ వంటి ఏ ఇతర అనారోగ్య సమస్యలు కావొచ్చు. అలాంటి సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు కోలుకోవాలంటే చాలా కష్టం. దీనికి ఖరీదైన చికిత్స చాలా అవసరం.

కానీ, ఇది అందరికీ సాధ్యపడదు. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన చిన్నారులు ఇలాంటి అరుదైన వ్యాధుల బారినపడితే.. దాతల సహాయం చేస్తే మరో మార్గం లేదు. దీంతో చాలామంది పిల్లలు సరైనా చికిత్స అందక, ఎదుగుదల లేక మరణిస్తుంటారు. అయితే ఇక మీదట చిన్నారులకు అలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదనే నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి శుభవార్త చెప్పింది. ఇంతకీ అదేమిటంటే..

 అరుదైన జబ్బులతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారులకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి ఓ శుభవార్త చెప్పింది. అలాంటి వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి రూ. 50 లక్షల ఖరీదైన ఉచిత వైద్యం అందించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన  నేషనల్‌ పాలసీ ఫర్‌ రేర్‌ డిసీజ్‌ (NPRD) అనే పాలసీని ఇప్పుడు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కూడా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జెనెటిక్‌,  అరుదైన వ్యాధులతో బాధపడే చిన్నారులకు నిమ్స్ ఆసుపత్రిలో స్పెషల్ డాక్టర్లు, వార్డులతో పాటు ఖరీదైన ట్రీట్ మెంట్ ను అందించేందుకు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్‌పీఆర్‌డీ పాలసీని  గౌచర్‌, పాంపే వంటి అరుదైన, జెనెటిక్‌ జబ్బుల బారిన పడిన చిన్నారులకు చికిత్స అందించేందుకు అందుబాటులోకి  తీసుకొచ్చింది.

ఇకపోతే.. నిమ్స్ హాస్పిటల్ లో ఈ రకమైన అరుదైన వ్యాధులకు చికిత్స అందించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు. ముఖ్యంగా నిమ్స్‌ హాస్పిటల్‌లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ జెనెటిక్‌ విభాగంలో ఈ డే-కేర్‌ సదుపాయాన్ని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఒక్కో చిన్నారి చికిత్సకు రూ.50 లక్షలను సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ మినిస్ట్రీ నుంచి నిధులు కేటాయిస్తారని ఆయన  చెప్పారు. దాంతో బాధిత చిన్నారులకు ఉచితంగా చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం గౌచర్‌ వ్యాధితో బాధపడుతున్న 26 మంది పిల్లలకు నిమ్స్‌లో ఇప్పటికే చికిత్స  జరుగుతోందని ఆయన తెలిపారు.  అలాగే జెనెటిక్‌ వ్యాధులతో బాధపడే పిల్లలకు లైఫ్‌టైమ్ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఈ వ్యాధి పిల్లల డాక్టర్ వద్దకు వెళ్తే గుర్తిస్తారని ఆయన తెలిపారు. ఈ వ్యాధికి చికిత్స  పిల్లల బరువు, వయస్సును బట్టి చికిత్సలు అందించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. మరి, అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments