Dharani
రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. డిసెంబర్ 7 న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి ఏ సమయానికి అంటే..
రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. డిసెంబర్ 7 న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి ఏ సమయానికి అంటే..
Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 7న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం 1. 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, సీపీ ఎల్బీ స్టేడియానికి రానున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు ప్రమాణస్వీకార ఏర్పాట్లు, భద్రతను పరిశీలిస్తున్నారు.
తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. నేడు ఆయన కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో రేవంత్ సమావేశం అవుతారు. సీఎంగా అవకాశం కల్పించినందుకు రేవంత్ వారికి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. అదేవిధంగా 7న ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానిస్తారు. కాంగ్రెస్ పెద్దలతో భేటీలో కేబినెట్ కూర్పుపైనా రేవంత్ చర్చించనున్నారు.