Dharani
Revanth Reddy-Pending DA To Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలోనే వారి ఖాతాల్లో భారీ నగదును జమ చేయనుంది. ఆ వివరాలు..
Revanth Reddy-Pending DA To Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలోనే వారి ఖాతాల్లో భారీ నగదును జమ చేయనుంది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తుంది. మరీ ముఖ్యంగా ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ.. ప్రజల్లో తమ పట్ల విశ్వాసం పెంచుకునే ప్రయత్నంలో ఉంది. కేవలం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మాత్రమే కాక.. అనేక నిర్ణయాలను తీసుకుంటూ సంక్షేమ పాలనకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోంది. సమాజంలోని అన్ని వర్గాల వారి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు, నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ ఎగిరి గంతేసే వార్త చెప్పింది. వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఓ అంశంపై కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం వల్ల త్వరలోనే వారి ఖాతాల్లో భారీగా నగదు జమ కానుంది. ఇంతకు ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి అంటే..
ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) చెల్లించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఆగస్టు 15 తర్వాత ఉద్యోగులకు డీఏ ప్రకటించనున్నట్టు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. తాజాగా అనగా శుక్రవారం నాడు నరేందర్‌రెడ్డి.. ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం పెండింగ్ డీఏపై కీలక ప్రకటన చేశారు. రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే.. అనగా ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగులందరికీ బకాయి ఉన్న డీఏ ప్రకటించనున్నట్టు వెల్లడించారు. అయితే.. ఒకటా, రెండా అనేది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారని అని చెప్పుకొచ్చారు.
శుక్రవారం నాడు వేం నరేందర్ రెడ్డి.. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. బదిలీలు, పదోన్నతులు సజావుగా నిర్వహించినందుకు ప్రభుత్వానికి సంఘాల నాయకులు ముందుగా అభినందనలు తెలిపారు. బదిలీలు, పదోన్నతుల్లో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాయకులు వేం నరేందర్ రెడ్డిని కోరారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపట్ల సానుకూలంగా స్పందించిన వేం నరేందర్ రెడ్డి.. అన్ని సంఘాలతో చర్చించి ప్రాధాన్యతాక్రమంలో సమస్యల జాబితాను ఉమ్మడిగా రూపొందించి ఇస్తే.. మూడు జేఏసీల పక్షాన పరిమిత సంఖ్యలో ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించి దీనిపై చర్చించిన తర్వాత.. సీఎంతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పుకొచ్చారు. అంటే త్వరలోనే డీఏపై కీలక ప్రకటన రానున్నట్లు అర్థం అవుతోంది.