భార్య చేసిన పనికి భర్తను హత్య చేసిన బంధువులు!

ఓ వివాహిత చేసిన పనికి ఆమె భర్తను హత్య చేశారు బంధువులు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ వివాహిత ఏం చేసింది? ఆ వివరాల్లోకి వెళ్తే..

ఓ వివాహిత చేసిన పనికి ఆమె భర్తను హత్య చేశారు బంధువులు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ వివాహిత ఏం చేసింది? ఆ వివరాల్లోకి వెళ్తే..

మూడు ముళ్ల బంధంతో ఒక్కటై నూరేళ్లు కలిసి జీవించాల్సిన వారు చిన్న చిన్న కారణాలతో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధాలైనా, ప్రేమ వివాహాలు అయినా మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. భార్యా భర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ఆర్థిక పరమైన సమస్యలు, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించే కారణాలతో మనస్థాపాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదే రీతిలో ఓ వివాహిత కుటుంబ కలహాలు, వేధింపుల కారణాలతో తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. ఆమె చేసిన పనికి ఆ వివాహిత తరఫు బంధువులు ఆమె భర్తను హత్య చేశారు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మూడేళ్ల క్రితం ఓ యువకుడితో ప్రేమ వివాహం చేసుకున్న లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన సింధు కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆగ్రహం చెందిన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె భర్తను కొట్టి చంపారు. సింధు (26) అనే యువతికి అచ్చంపేటలోని ఓ హాస్పిటల్లో పనిచేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన నాగార్జున (30)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మనసులు, అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మూడు సంవత్సరాల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన అనంతరం అచ్చంపేటలో కాపురం పెట్టారు. కొంతకాలం పాటు వీరి సంసార జీవితం బాగానే సాగింది.

ఆ తర్వాత కుటుంబంలో గొడవలు చోటుచేసుకున్నాయి. కాపురంలో చెలరేగిన చిచ్చుతో తీవ్ర మనస్థాపానికి గురైన సింధు శుక్రవారం రాత్రి తమ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ విషయం తెలిసిన బంధువులు వెంటనే సింధును అచ్చంపేటలోని ఓ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో సింధు మరణించింది. మృతదేహంతో అచ్చంపేటకు చేరుకున్న వివాహిత సింధు బంధువులు ఆమె భర్త నాగార్జునపై దాడికి పాల్పడ్డారు. సింధు ఆత్మహత్యకు నాగార్జుననే కారణమని అతడిని కొట్టి చంపారు. ఆమ‌న‌గ‌ల్లు వ‌ద్ద నాగార్జున‌ను కొట్టి చంపిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స్టానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మరి సింధు ఆత్మహత్యకు కారణం ఆమె భర్తే అని కుటుంబ సభ్యులు, బంధువులు అతడిని హత్య చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments