బ్రేకింగ్: కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం!

ఇటీవల దేశంలో వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. టెకాఫ్ అయిన కొద్ది సేపట్లోనే టెక్నికల్ ఇబ్బందుల వల్ల కూలిపోతున్నాయి. ఎంతో మంది ప్రయాణికులు చనిపోతున్నారు.

ఇటీవల దేశంలో వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. టెకాఫ్ అయిన కొద్ది సేపట్లోనే టెక్నికల్ ఇబ్బందుల వల్ల కూలిపోతున్నాయి. ఎంతో మంది ప్రయాణికులు చనిపోతున్నారు.

ఇటీవల పలు చోట్ల ట్రైనింగ్ విమానాలు హఠాత్తుగా కుప్పకూలి పలువురు పైలట్లు మరణించిన విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది సేపట్లోనే సాంకేతిక లోపాల వల్ల కూలిపోతున్నాయి.  మెదక్ జిల్లాలోని తుఫ్రాన్ పట్టణంలో రావెల్లి శివారు ప్రాంతంలో ఒక శిక్షణా విమానం కుప్పకూలిపోయింది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన శిక్షణ విమానం ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. టెకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక లోపం వల్ల కుప్పకూలిపోయి ఉండవొచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్ధం వచ్చి.. మంటలు చెలరేగి విమానం పూర్తిగా కాలిపోయింది. శిక్షణ విమానం కూలిన విషయం స్థానికులు గమనించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అది హైదరాబాద్ దుండిగల్ విమనాశ్రయానికి చెందిన ట్రైనింగ్ విమానం అని ప్రాథమికంగా గుర్తించారు. కూలిన ట్రైనీ విమానంలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గురైంది పిలాటియస్ పీసీ 7 ఎంకే II విమానంగా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ‘ పీసీ 7 ఎంకే II ట్రైనింగ్ విమానం సార్టీల సందర్భంగా నేటి ఉదయం ప్రమాదానికి గురైందని అంటూ వాయుసేన ధృవీకరిస్తూ ట్విట్ చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో విమాన శిక్షకుడితో పాటు ట్రైనర్ మరణించారు.

Show comments