P Venkatesh
భగ భగ మండే ఎండలకు ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. నేడు హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మరికొన్ని రోజులు వర్షాలు కురువనున్నాయి.
భగ భగ మండే ఎండలకు ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. నేడు హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మరికొన్ని రోజులు వర్షాలు కురువనున్నాయి.
P Venkatesh
ఇన్ని రోజలు ఎండలతో అల్లాడిపోయిన జనాలకు బిగ్ రిలీఫ్. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్న వేళ రాష్ట్రంలో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా ఆదివారం హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వానలు కురుస్తుండడంతో ప్రజలకు ఉపశమనం లభించినట్లైంది. అధిక వేడి ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో రిలాక్స్ అవుతున్నారు. హైదరాబాద్ లో ఉదయం నుంచే నిప్పులు కురిపించిన భానుడు.. సాయంత్రానికి చల్లబడిపోయాడు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు చోట్ల మేఘాలు కమ్ముకుని వాన కురుస్తున్నది. మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, ఉప్పల్, రామంతాపూర్, చిలుకానగర్, మేడిపల్లి, బోడుప్పల్, ఫీర్జాదిగూడ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. వర్షం కురుస్తున్న వేళ వాహనదారులు ఆయా రూట్లలో వెళ్లే వారు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనుండడంతో అవసరమైతే తప్ప బయటకి రావొద్దని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోని ఆసిఫాబాద్, మందమర్రి, ధర్మపురి, కమలాపూర్, కరీంనగర్, చెన్నూరు, పెద్దపల్లి, సిర్పూర్, కాగజ్‌నగర్, షాద్‌నగర్, మోత్కూరు, భువనగిరిలోనూ వర్షం కురుస్తున్నది. కాగా, నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. మే 30వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు కర్ణాటక మీదుగా.. ఇవాళ రాయలసీమలోకి విస్తరించాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.