Ragging: కాకతీయ యూనివర్సిటీ చరిత్రలో తొలిసారి.. అమ్మాయిల ర్యాగింగ్.. 78 మంది స్టూడెంట్స్ సస్పెండ్

వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. వీరిలో అమ్మాయిలు కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో 78 మంది స్టూడెంట్స్ ని సస్పెండ్ చేశారు. ఆ వివరాలు..

వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. వీరిలో అమ్మాయిలు కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో 78 మంది స్టూడెంట్స్ ని సస్పెండ్ చేశారు. ఆ వివరాలు..

ర్యాగింగ్.. ఈ పేరు చెప్తే గతంలో విద్యార్థులు గజ్జున వణికేవారు. ర్యాగింగ్ భూతానికి భయపడి చాలా మంది కాలేజీ అంటే భయపడేవారు.. కొన్ని చోట్ల మితిమీరిన ర్యాగింగ్ ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ఈక్రమంలో దీన్ని ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకుని.. ర్యాగింగ్ భూతాన్ని అణిచి వేయడానికి కఠిన చట్టాలను అమల్లోకి తీసుకువచ్చాయి. యాంటీ ర్యాంగిగ్ నిబంధలను తెచ్చారు. అయితే నేటికి కూడా కొన్ని చోట్ల ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో ర్యాంగింగ్ కలకలం రేగింది. వీరిలో అమ్మాయిలు కూడా ఉండటం గమనార్హం.  ఆ వివరాలు..

ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాందించుకున్న కాకతీయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ ఘటన వెలుగు చూడటం సంచలనంగా మారింది.  విద్యార్థినీలు కూడా దీనిలో భాగం కావడం గమనార్హం. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్ చేసిన వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మెుత్తం 78 మంది విద్యార్థిని, విద్యార్థులను వారంపాటు హాస్టల్స్‌ నుంచి సస్పెండ్‌ చేసింది వర్సిటీ యాజమాన్యం. కేయూ చరిత్రలో ఇంతమంది విద్యార్థులను ఒకేసారి సస్పెండ్‌ చేయడం ఇదే మెుదటిసారి అంటున్నారు.

పరిచయాల పేరుతో పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు వర్సిటీ అధికారులు గుర్తించారు. పద్మావతి మహిళా వసతి గృహంలో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థినిల వివరాలు సేకరించారు. అంతేకాక మిగతా అన్ని విభాగాల్లోనూ ర్యాగింగ్‌ జరుగుతున్నట్లు వర్సిటీ అధికారులు గుర్తించారు. ఈక్రమంలో కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగాల్లో ర్యాగింగ్ కు పాల్పడినం మొత్తం 78 స్టూడెంట్స్ ని గుర్తించి సస్పెండ్‌ చేశారు.

మిగతా విభాగాల్లోనూ ర్యాగింగ్‌ చేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నామని ఈ సందర్భంగా వర్సిటీ అధికారులు తెలిపారు. సరైన ఆధారాలు లభిస్తే వారిని కూడా సస్పెండ్‌ చేస్తామన్నారు. అంతేకాక క్రిస్మస్ పండుగ నేపథ్యంలో..  అన్ని వసతి గృహాలకు నేటి (శనివారం) నుంచి ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. విద్యార్థులు తక్షణమే వసతి గృహాలను ఖాళీ చేయాలని సూచించామని వర్సటీ అధికారులు తెలిపారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show comments