iDreamPost
android-app
ios-app

సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్న పోలీసుల ప్రీ వెడ్‌ షూట్‌ వీడియో!

  • Published Sep 16, 2023 | 9:27 PM Updated Updated Sep 16, 2023 | 9:34 PM
  • Published Sep 16, 2023 | 9:27 PMUpdated Sep 16, 2023 | 9:34 PM
సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్న పోలీసుల ప్రీ వెడ్‌ షూట్‌ వీడియో!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురమైన జ్ఞాపకం. పెళ్లి కోసం నెలరోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటుంటారు. వివాహ వేదిక నుంచి మొదలు పెడితే పెళ్లి బట్టలు, ఆభరణాలు ఇలా ప్రతి ఒక్కటి స్పెషల్ గా ఉండే విధంగా చూసుకుంటారు. ఈ మధ్య పెళ్లికంటే ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం ట్రెండ్ గా మారింది. జీవితంలో గుర్తుండిపోయేలా సినిమాల్లో మాదిరిగా అద్భుతమైన లొకేషన్లలో ఫొటోలు, వీడియోలతో ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకుంటున్నారు. అయితే హైదరాబాద్ కు చెందిన పోలీసులు తమ ప్రీ వెడ్డింగ్ షూట్ ను ఇంకాస్త స్పెషల్ గా మార్చుకున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో జరిగిన ఇద్దరు పోలీసుల ప్రీ వెడ్డింగ్ షూట్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. కాగా ఎస్సై భావనతో ఏఆర్‌ ఎస్సై రావూరి కిషోర్‌ వివాహం ఆగష్టు 26వ తేదీన జరిగింది. అయితే పెళ్లికి ముందు వీరు ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకోగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఎస్సై భావన పోలీస్ వాహనంలో రాయల్ ఎంట్రీ ఇవ్వగా, ఏఆర్‌ ఎస్సై రావూరి కిషోర్‌ హీరో రేంజ్ లో ఎంట్రీ ఇచ్చాడు. సినిమాను తలపించేలా ఉన్న వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ తెగ ఆకట్టుకుంటోంది. అలా మొదలైన ఆ షూట్ చార్మినార్ ఇతర లొకేషన్లలో ఖుషీ సినిమాలోని సాంగ్ తో ఇద్దరు అదరగొట్టారు. ఇక వీరి ప్రీ వెడ్డింగ్ కు సంబంధించిన వీడియో నెట్టంట్లో వైరల్ కాగా కొందరు సానకూలంగా స్పందించగా మరికొందరు పోలీస్ స్టేషన్లో షూట్ ఏంటనీ విమర్శిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş