విషాదం.. ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ కన్నుమూత!

తెలుగు దూరదర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఎంతో మంది న్యూస్ రీడర్లుగా పని చేశారు. అందులోని మొట్ట మొదటి తెలుగు రీడర్ కన్నుమూశారు. ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో తన మాటలు, యాంకరింగ్‌తో తెలుగువారిని ప్రభావితం చేసిన తొలితరం ఆయనే.

తెలుగు దూరదర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఎంతో మంది న్యూస్ రీడర్లుగా పని చేశారు. అందులోని మొట్ట మొదటి తెలుగు రీడర్ కన్నుమూశారు. ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో తన మాటలు, యాంకరింగ్‌తో తెలుగువారిని ప్రభావితం చేసిన తొలితరం ఆయనే.

ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య  సమస్యలు,  గుండెపోటు, ఆత్మహత్య వంటి వివిధ కారణాలతో ప్రముఖులు మరణిస్తున్నారు. ఇటీవలే తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అలానే నిన్న ప్రముఖ నటి మీరా జాస్మిన్ తండ్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీకి చెందిన వారు వివిధ కారణాలతో మరణించి…కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను విషాదంలో ఉంచుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ గుండెపోటుతో మరణించారు.

తెలుగు దూరదర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు అందరికి తెలిసిన ఒక్కే ఒక్క ఛానల్ దూరదర్శన్ ఒక్కటే. అప్పట్లో ఇందులో వచ్చే న్యూస్ కోసం జనం ఎంతగానో ఎదురు చూసే వారు. ఆ కాలం నాటి వారికి ఎంతో సుపరిచుతులు తెలుగు దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్. దూరదర్శనం ప్రారంభిన కాలంలో వారికి ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల పాటు ఆయన దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా పని చేశారు. అలానే పలు కార్యక్రమాలకు యాంకర్ గా కూడా పని చేశారు. ఇక న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ శుక్రవారం కన్నుమూశారు.

మలక్ పేట్ యశోద ఆస్పత్రిలో గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అందరూ విషాదంలో మునిగిపోయారు. 1977 అక్టోబర్ 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి ప్రారంభించగా, మొట్టమొదటి న్యూస్ రీడర్ గా శాంతి స్వరూప్ పని చేశారు. ప్రాంప్టర్ లేని సమయంలో తప్పులు లేకుండా జాగ్రత్తగా వార్తలు చదివి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోమాజీగూడలో స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి న్యూస్ రీడర్ శాంతిస్వరూప్. 1978లో ఆయన దూరదర్శన్‌లో ఉద్యోగిగా చేరారు. 1983 నవంబరు 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్‌గా ఆయనకే అవకాశం దక్కింది. 2011లో ఆయన పదవి విరమణ పొందారు. నేటికాలంలో అయితే న్యూస్ రీడర్లు ప్రాంప్టర్ నే ఎక్కువగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ప్రాంప్టర్  ను వినియోగించి న్యూస్ రీడింగ్ చేస్తున్నారు. కానీ దూరదర్శన్ ప్రారంభించిన రోజుల్లో ఇలాంటి అవకాశం ఉండేది కాదు.  అలాంటి టైమ్ లో  శాంతి స్వరూప్ దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రాంప్టర్ లేకుండానే  న్యూస్ రీడింగ్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.  తెలుగులో ఏళ్ల పాటు తన న్యూస్ రీడింగ్, యాంకరింగ్ తో ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు.  దూరదర్శన్ అనగానే మొట్ట మొదట ఆయన గుర్తుకు వస్తారంటే అతిశయోక్తి కాదు.  అలా ఏళ్ల పాటు దూరదర్శన్ ఛానల్లో శాంతి స్వరూప్ తన సేవలను అందించారు. 2011లో పదవి విరమణ తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గుండెపోటు మృతి చెంది.. అందరిని షాక్ గురి చేశారు. ఆయన మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Show comments