Dharani
Ponnam Prabhakar: ఉమెన్స్ డే నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
Ponnam Prabhakar: ఉమెన్స్ డే నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. మహిళా సాధికారిత, వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించడం కోసం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఆరు గ్యారెంటీల్లో మహిళల కోసం అనేక హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను తీసుకొచ్చింది. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలను మరిన్ని రంగాల్లో ప్రోత్సాహించే దిశగా అడుగులు వేస్తోంది.
కొన్నేళ్ల క్రితం వరకు వాహనాలు నడపడం మగవారి పని అన్నట్లుగా చూసేవారు. కానీ రాను రాను.. మహిళలు కూడా డ్రైవర్లుగా పని చేస్తున్నారు. కార్లు, లారీలు, బస్సులు మాత్రమే కాక ఏకంగా విమానలు కూడా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్‌ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమిస్తామని చెప్పుకొచ్చింది. ఈమేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ టీఎస్‌ఆర్టీసీ కళాభవన్‌లో గురువారం నిర్వహించిన గ్రాండ్ ఫెస్టివల్ చాలేంజ్‌తో పాటు.. మేడారం జాతరలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఉద్యోగులు, దసరా లక్కీ డ్రా విజేతలకు బహుమతులు, అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడకకు ముఖ్య అతిథిగా హాజరైన పొన్నం.. టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో కలిసి 157 మంది ఉత్తమ ఉద్యోగులకు మంత్రి అవార్డులు అందజేసి వారిని సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సీసీఎస్, పీఎఫ్ ఇతర పెండింగ్ విషయాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అలానే మహాలక్ష్మి పథకం అమలులో అత్యుత్తమంగా విధులు నిర్వహిస్తోన్న మహిళా సిబ్బందికి కూడా అవార్డులు అందజేయాని సజ్జనార్ సూచించారు. ఈసందర్భంగా టీఎస్‌ఆర్టీసీలో మహిళా డ్రైవర్ల నియామకంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థలో లేడీ డ్రైవర్లను నియమించే అంశాన్ని పరిశీలించాలని.. తద్వారా వారికి కూడా సమాన అవకాశాలు దక్కుతాయని మంత్రి పొన్నం సజ్జనార్‌కు సూచించారు.
మహాలక్ష్మీ పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుకూలంగా సంస్థ కొత్త బస్సులను కొనుగోలు చేస్తుందని.. అందుకు తమ ప్రభుత్వం సహాకారం అందిస్తుందని పేర్కొన్నారు. కొత్త బస్సులు కొనుగోలు నేపథ్యంలో త్వరలోనే టీఎస్‌ఆర్టీసీలో నియామకాలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. సంస్థ బాగుకోసం ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిసామని చెప్పారు. మంత్రి కామెంట్స్ నేపథ్యంలో త్వరలోనే ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు రానున్నట్లు తెలుస్తోంది.