వీడియో: గుండెపోటుతో పడిపోయిన మహిళ.. దేవుడిలా కాపాడిన పోలీస్!

CPR: ఇటీవల కాలంలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య ఎక్కువైంది. అయితే ఇలా హార్ట్ ఎటాక్ కి గురైన వారికి వెంటనే ప్రాణాలు నిలిపేందుకు సీపీఆర్ చేస్తారు. తాజాగా కార్డియో అరెస్ట్ గురైన ఓ మహిళ విషయంలో పోలీసులు దేవుడిలా మారి..ప్రాణాలు కాపాడారు.

CPR: ఇటీవల కాలంలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య ఎక్కువైంది. అయితే ఇలా హార్ట్ ఎటాక్ కి గురైన వారికి వెంటనే ప్రాణాలు నిలిపేందుకు సీపీఆర్ చేస్తారు. తాజాగా కార్డియో అరెస్ట్ గురైన ఓ మహిళ విషయంలో పోలీసులు దేవుడిలా మారి..ప్రాణాలు కాపాడారు.

ఇటీవల కాలంలో గుండె పోటు కారణంగా సంభవించే మరణాల సంఖ్య బాగా పెరిగి పోయింది. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరిలోనూ ఈ హార్ట్ ఎటాక్ సంభవిస్తుంది. యువత, మహిళలు గుండెపోటుకు గురికావడం అందరిలో ఆందోళన కలిగిస్తుంది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించే వారు ఉన్నట్లుండి కుప్పకూలిపోతుంటారు. అయితే సకాలంలో ఎవరైనా సీపీఆర్ చేయడంతో కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. తాజాగా రాత్రివేళ రోడ్డు పక్కన ఓ మహిళ పడిపోయింది. అయితే దేవుడే పోలీసుల రూపంలో వచ్చి ఆమెను కాపాడారు. మరి.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ పట్టణంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో రాత్రి 9.30 గంటల సమయంలో యాదమ్మ అనే మహిళ కార్డియాక్ అరెస్ట్ కి గురైంది. అకస్మాత్తుగా ఇలా గుండె పోటు రావడంతో యాదమ్మ రోడ్డు పక్కన స్పృహతప్పి పడిపోయింది. అదే సమయంలో అటుగా బాంబ్ డిస్పోజల్ పోలీస్ సిబ్బంది వెళ్తున్నారు. ఆ టీమ్ లోని గోవర్ధన్, వెంకట్ కుమార్ అనే పోలీసుల తక్షణణే స్పందించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు.. ఆమె ప్రాణాలు నిలబెడ్డాలని వారు నిర్ణయించుకున్నారు. రోడ్డుపై పడిపోయిన యాదమ్మ వద్దకు చేరుకుని  సీపీఆర్ నిర్వహించారు. కాసేపటి తరువాత ఆమె స్పృహలోకి  వచ్చి ఊపిరి తీసుకుంది. అనంతరం వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. అలానే  ఆమె వివరాలను తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ప్రస్తుతం ఈ  ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్ట్ ఎటాక్ కి గురైన మహిళ విషయంలో సకాలంలో స్పందించి ఆమె ప్రాణాలు కాపాడిన పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వారి సమయస్ఫూర్తి ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టిందని, ఒక కుటుంబానికి ఆధారమైన ఆమె ప్రాణాలతో తిరిగొచ్చేలా చేసిందని స్థానికులు అభినందిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. గుండెపోటు వచ్చిన సందర్భంలో చికిత్స అందించడం ఏ మాత్రం ఆలస్యం అయినా ప్రాణాలే పోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు బాధితులను కాపాడేందుకు సీపీఆర్ అనేది నిర్వహిస్తారు. ఈ సీపీఆర్ అనేది హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత గొల్డెన్ అవర్ లో చేస్తే మేలు జరుగుతుంది. ఈ అత్యవసర చికిత్స ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఎక్కువగా ఛాన్సులు ఉన్నాయి. గతంలో కూడా అనేక మందిని సీపీఆర్ ద్వారా కాపాడిన ఘటనలు ఉన్నాయి. మరి..తాజాగా మహిళ ప్రాణాలు కాపాడిన ఈ పోలీసులపై మీ ప్రశంసలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments