iDreamPost
android-app
ios-app

పోలీస్ డ్రెస్సు వేసుకుని దందాలు! ఇంట్లో ఉద్యోగం ఉన్నా ఇదేమి పని!

Police Caught a Fake Cop: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి లగ్జరీ జీవితాన్ని గడపాలని చాలా మంది అనుకుంటారు. అందుకోసం ఎన్నో అక్రమాలకు తెగబడుతుంటారు.

Police Caught a Fake Cop: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి లగ్జరీ జీవితాన్ని గడపాలని చాలా మంది అనుకుంటారు. అందుకోసం ఎన్నో అక్రమాలకు తెగబడుతుంటారు.

పోలీస్ డ్రెస్సు వేసుకుని దందాలు! ఇంట్లో ఉద్యోగం ఉన్నా ఇదేమి పని!

ఈ మద్య కాలంలో కొంతమంది డబ్బు సంపాదన కోసం ఎన్నో రకాల అక్రమాలకు పాల్పపడుతున్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, కిడ్నాపులు, బెదిరింపుల, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ అమ్మకాలు.. ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి ఎన్ని దందాలు చేసినా.. ఏదో ఒక సమయంలో పట్టుబడిపోతున్నారు. సాధారణంగా కొంతమంది కేటుగాళ్లు ట్రాఫిక్ పోలీస్ డ్రెస్సుల్లో రోడ్లపై నిలబడి దర్జాగా వాహనదారుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తుంటారు. మరికొంతమంది పోలీస్ డ్రస్ వేసుకొని అమాయకులను దోచేస్తుంటారు. అలాంటి ఓ ఘరానా మోసగాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..

నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఓ ఘరానా మోసగాడి గుట్టు రట్టు చేశారు పోలీసులు. కొంతకాలంగా పోలీస్ డ్రెస్ వేసుకొని  అమాయకులను బెదిరిస్తూ డబ్బులు వసూళ్లు చేస్తున్న నకిలీ పోలీస్ ని పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు.  ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ కి చెందిన రాజు అనే వ్యక్తి పోలీసు దుస్తులతో వచ్చి ఓ వ్యక్తి వద్ద సెల్ ఫోన్ దొంగతనం చేశాడు. మరో చోట అదే తరహాలో చోరీకి పాల్పపడుతున్న సమయంలో కొంతమంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు అక్కడికి చేరుకొని నీకు ఈ యూనీఫాం ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు.

తన అన్న పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తారని ఆయన డ్రెస్ ధరించినట్లు సమాధానం ఇచ్చాడు. దీంతో ఫేక్ కానిస్టేబుల్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. గతంలో పలుమార్లు రాజు పోలీస్ అంటూ అమాయకులను బెదిరించి డబ్బులు గుంజినట్లు తెలుస్తుంది. తాను ఆర్పీఎఫ్ ఎస్ఐ అంటూ ఏడాది కాలం పాటు అందరినీ బురిడీ కొట్టించిన నల్లగొండ జిల్లాకు చెందిన మాళవిక ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లాలో ఫేక్ కానిస్టేబుల్ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది ట్రాఫిక్ సిబ్బంది డ్రెస్ వేసుకొని వాహనదారులను మోసం చేస్తూ అక్రమంగా చలాన్ల పేరుతో వసూళ్లకు పాల్పపడ్డ ఘటనలు ఎన్నో ఉన్నాయి.  ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి