Telangana: తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై హై కోర్టులో పిటిషన్!

తెలంగాణాలో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత.. వారు అమలు చేసిన పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై తాజగా ఓ వ్యక్తి ఉచిత బస్సు ప్రయాణంపై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

తెలంగాణాలో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత.. వారు అమలు చేసిన పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై తాజగా ఓ వ్యక్తి ఉచిత బస్సు ప్రయాణంపై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న ఉచిత బస్సు ప్రయాణం.. విషయంలో ఇప్పటికే మనం నిత్యం ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం. గతంతో పోలిస్తే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కలిపించిన నాటి నుండి.. ఆర్టీసీ బస్సులలో రద్దీ విపరీతంగా పెరిగింది. మరో పక్క బస్సుల సంఖ్య కూడా తగ్గడంతో పబ్లిక్ అవస్థలకు గురి అవ్వాల్సి వస్తుంది. దీనితో చాలా మంది ప్రయాణికులు ఈ ఉచిత బస్సు పథకంపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రైవేట్ ఉద్యోగి ఉచిత బస్సు ప్రయాణంపై.. తెలంగాణ  హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశాడు . దీనితో ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

ఆ ప్రైవేట్ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. తెలంగాణాలో ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. జీవో47ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశాడు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో.. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం లేదని ఆ ఉద్యోగి పేర్కొన్నారు. మహిళలకు మాత్రమే ఉచిత బస్సును ప్రయాణ వసతిని కల్పించడం కారణంగా..  పురుషులకు బస్సులలో కనీసం సీట్లు దొరకడం లేదని కూడా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా  కేవలం మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ వసతిని కల్పించడం అనేది.. పురుషుల పట్ల వివక్ష చూపించడమే అవుతుందని.. ఇది రాజ్యాంగంలోని నియమాలకు విరుద్ధం అని తెలిపారు. ఫ్రీ బస్సు కారణంగా చాలా మంది మహిళలు.. వారి అవసరాలకు మించి ప్రయాణం చేస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని.. దాని కారణంగా టికెట్ కొనుగోలు చేసి ప్రయాణం చేసే ప్రయాణికులు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా పిటిషనర్ పేర్కొన్నారు. 

అలాగే ఉచిత ప్రయాణం కారణంగా..  ఆర్టీసీపై పడే ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం కూడా అన్యాయమేనని, పన్నుల రూపంలో ప్రజలు కట్టిన సొమ్మును మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించే విధంగా.. ఉపయోగించడం సరైనది కాదని.. ఈ విషయాలన్నింటిని పరిగణలోకి తీసుకుని. తెలంగాణలో అమలులో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని.. నిలిపివేయాలని కోర్టు వారిని విజ్ఞప్తి చేశాడు ఆ ప్రైవేట్ ఉద్యోగి. దీనితో ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించి విచారణ కొనసాగించనున్నారు. మరి, ఉచిత బస్సుల ప్రయాణాన్ని నిలిపివేయాలని హైకోర్టులో.. ఓ ప్రైవేట్ ఉద్యోగి వేసిన పిటిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 

 

Show comments