Actor, Govt Employees Study In Same College: వీళ్లది వేర్వేరు బ్యాక్ గ్రౌండ్.. కానీ విచిత్రంగా అక్కడ కలిశారు

వీళ్లది వేర్వేరు బ్యాక్ గ్రౌండ్.. కానీ విచిత్రంగా అక్కడ కలిశారు

Actor, Govt Employees Study In Same College: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) దేశంలోనే టాప్ బిజినెస్ స్కూలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉంది. హైదరాబాద్ లో ఉన్న అంతర్జాతీయ బిజినెస్ కాలేజ్ ఇది. ప్రతి ఏటా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ బిజినెస్ స్కూల్లో చేరుతుంటారు. ఈ ఏడాది ఒక తెలుగు హీరో, మోదీతో పని చేసిన వ్యక్తితో పాటు పలువురు విభిన్న రంగాలకు చెందిన వారు బిజినెస్ స్కూల్లో జాయిన్ అయ్యారు.

Actor, Govt Employees Study In Same College: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) దేశంలోనే టాప్ బిజినెస్ స్కూలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉంది. హైదరాబాద్ లో ఉన్న అంతర్జాతీయ బిజినెస్ కాలేజ్ ఇది. ప్రతి ఏటా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ బిజినెస్ స్కూల్లో చేరుతుంటారు. ఈ ఏడాది ఒక తెలుగు హీరో, మోదీతో పని చేసిన వ్యక్తితో పాటు పలువురు విభిన్న రంగాలకు చెందిన వారు బిజినెస్ స్కూల్లో జాయిన్ అయ్యారు.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)  2025 ఏడాదికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ని (పీజీపీని) ప్రారంభించింది. డిఫెన్స్ లో అనుభవం కలిగిన నిపుణులు, క్రీడలు, మెడిసిన్, వినోదం, ప్రభుత్వ రంగానికి చెందిన పబ్లిక్ సర్వెంట్స్ ఇలా విభిన్న నేపథ్యం కలిగిన విద్యార్థులతో పీజీపీ ప్రోగ్రామ్ ని ఐఎస్బీ స్టార్ట్ చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పీజీపీ 2025 బ్యాచ్ లో 7 శాతం మహిళా అభ్యర్థులు పెరిగారు. గత ఏడాది 40 శాతం మంది మహిళలు ఉండగా.. ఈ ఏడాది 47 శాతం మంది మహిళలు బ్యాచ్ లో జాయిన్ అయ్యారని ఐఎస్బీ ఇన్స్టిట్యూట్ తెలిపింది. 

ఆశిష్ కశ్యప్:

అయితే ఈ విద్యార్థుల్లో భారత ప్రభుత్వ రంగం నుంచి.. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో పని చేసిన ఆశిష్ కశ్యప్ ఉండడం విశేషం. ప్రభుత్వ కీలక మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పాలసీ అడ్వైజర్ గా, కౌన్సిలింగ్ లో నిపుణులుగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దినచర్యలు, ముఖ్యమైన విషయాలపై సలహాలు, ఈవెంట్స్ ని కోఆర్డినేట్ చేయడం వంటివి చూసుకునేవారు. ఈయన ప్రధానితో పాటు దేశీయ, విదేశీ పర్యటనల్లో పాల్గొన్నారు.        

విశాల్ యడవల్లి:

ఇండియా నేవీ నేపథ్యం నుంచి వచ్చిన విశాల్ యడవల్లికి.. సబ్ మెరైన్స్ లో అనుభవం ఉంది. ఈయన పబ్లిక్, ప్రైవేటు రంగానికి చెందిన పరిశ్రమలు, ల్యాబ్స్ తో సహకరించారు. న్యూక్లియర్ సబ్ మెరైన్ కోసం పరికరాలను తయారు చేశారు. ఇండియన్ నేవీ కోసం కొనుగోళ్లు, స్పేర్ పార్ట్స్ మెయింటెనెన్స్ వంటివి పర్యవేక్షించేవారు. అలాంటి ఈయన పీజీ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారు. 

ఆశిష్ పథక్:

డిఫెన్స్ (ఎయిర్ ఫోర్స్) లో ఫ్లయింగ్ స్క్వాడ్రన్ లో జూనియర్ నావిగేటర్ గా పని చేశారు ఆశిష్ పథక్. మెకనైజ్డ్ ట్రాన్స్ పోర్ట్ ని మేనేజ్ చేయడం, అసిస్టెంట్ మేనేజర్ గా హ్యూమన్ రీసోర్సెస్ ని హ్యాండిల్ చేయడం, సివిల్ మిలిటరీ ఇంటరాక్టివ్ ఈవెంట్స్ లో సేవలను అందించారు. 

అదితి శర్మ:

ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అదితి శర్మ.. డిప్యూటీ కమాండెంట్ గా పని చేశారు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో, మేనేజ్మెంట్ స్కిల్స్ తో సత్తా చాటారు.   

కుల్దీప్ కుమార్:

డిఫెన్స్ రంగం, భారతీయ రైల్వేస్ నుంచి వచ్చిన కుల్దీప్ కుమార్.. 2020లో ఇండియన్ పేటెంట్ ఆఫీస్.. కుల్దీప్ కుమార్ చేసిన మాడ్యులర్ ఎక్విప్మెంట్ డిజైన్ కి పేటెంట్ తో సత్కరించింది. రక్షణ రంగానికి వినూత్న సేవలను అందించినందుకు అతనికి ఈ గుర్తింపు లభించింది.  .    

అభిలాష్ బండారి:

అభిలాష్ బండారి ఈయనొక తెలుగు నటుడు. పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటించారు. రాజు గారి కోడి పలావు, డిటెక్టివ్ కార్తీక్, లవ్ యూ టూ, మిస్. ప్రీతి సినిమాల్లో నటించారు. ట్రాన్స్ జండర్ అనే ఛాలెంజింగ్ రోల్ లో నటించారు. పలు ప్రాజెక్ట్స్ కి ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈయన నటించిన ‘కల ఐతే ఈ నిజం’ అనే తొలి షార్ట్ ఫిల్మ్ కి బెస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.      

లక్ష్మి ప్రశాంతి కర్నాటి:

లక్ష్మి ప్రశాంతి కర్నాటి.. ఈమె ఒక రన్నర్. 2018 నుంచి 2023 వరకూ పలు రన్నింగ్ పోటీల్లో పాల్గొన్నారు. ఈమె దూరాలు నడిచే వాకర్ కూడా. యూఎస్ నేషనల్ పార్క్స్ లో 900 మైల్స్ అంటే 1448 కి.మీ. నడిచారు. 2022లో శాన్ ఫ్రాన్సిస్కో వద్ద ఫుల్ మారథాన్ లో పాల్గొని మెడల్ దక్కించుకున్నారు.

Show comments