New Year Celebration: డిసెంబర్ 31 అలర్ట్.. అలా చేస్తే రూ.15 వేల ఫైన్, రెండేళ్ల జైలు..!

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కఠిన ఆంక్షలు అమల్లోకి తీసుకువస్తున్నారు. డిసెంబర్ 31 నాడు నియమాలు ఉల్లంఘించిన వారికి రూ.15 వేల ఫైన్, రెండేళ్ల జైలు అని తెలిపారు. ఆ నియమాలు ఏవి అంటే..

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కఠిన ఆంక్షలు అమల్లోకి తీసుకువస్తున్నారు. డిసెంబర్ 31 నాడు నియమాలు ఉల్లంఘించిన వారికి రూ.15 వేల ఫైన్, రెండేళ్ల జైలు అని తెలిపారు. ఆ నియమాలు ఏవి అంటే..

మరో రెండు రోజుల్లో 2023 ముగియనుంది. 2024 సంవత్సరం ప్రారంభం కానుంది. ఇక నూతన సంవత్సరం నేపథ్యంలో నగరంలో వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక మద్యం సంగతి అయితే చెప్పక్కర్లేదు. డిసెంబర్ 31 నాడు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతాయని ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పబ్బులు, క్లబ్బులకు సూచనలు జారీ చేశారు. డ్రగ్స్ వినియోగంపై కూడా ఈసారి ఉక్కుపాదం మోపనున్నారు. అలానే 31 నాడు మందుబాబులకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు.

అయితే.. డిసెంబర్ 31 రోజున విచ్చలవిడిగా తాగి అర్ధరాత్రులు వాహనాలు నడిపి.. రోడ్ల మీద రచ్చ చేయకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు తీసుకొస్తున్నారు పోలీసులు. మందు తాగి వాహనాలు నడిపే వారికి చుక్కలు చూపించనున్నారు. దీనిలో భాగంగా డిసెంబర్ 31 నాడు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులకు రూ.15వేల వరకు జరిమానాతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించనున్నట్టు హైదరాబాద్ నగర పోలీసులు నిర్ణయించారు.

వీరిలో మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్లకు గరిష్ఠంగా రూ. 10వేల వరకు జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష వేయనున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక.. రెండోసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు పట్టుబడిన వారికి మాత్రం రూ. 15 వేల ఫైన్ తో పాటు 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాహనదారులు.. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

డిసెంబర్ 31న రాత్రి 8 గంటల నుంచే.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్‌కు మూడు రోజులు మాత్రమే ఉన్నందున.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు.. నగరవాసులకు ట్రాఫిక్ ఆంక్షలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలానే న్యూఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నగర పరిధిలోని ప్రధాన ఫ్లై ఓవర్లతో పాటు పలు రహదారులు కూడా మూసివేయనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.

Show comments