iDreamPost
android-app
ios-app

డ్రైవింగ్ లైసెన్స్ కు కొత్త పరీక్ష..ఇక అడ్డదారుల్లో లైసెన్స్ పొందేందుకు చెక్

  • Published Jul 12, 2024 | 12:12 PM Updated Updated Jul 12, 2024 | 12:12 PM

ప్రస్తుతం కాలంలో చాలామంది ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అధికారులను, బ్రోకారులను అనుసరించి వారిని మేనెజ్ చేసి టెస్ట్ పాసవ్వకుండా.. లైసెన్స్ పొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. మరి, అలాంటి వారిని దృష్టిలో పెట్టుకున్న అడ్డదారుల్లో లైసెన్స్ పొందే పద్ధతికి చెక్ పెడుతూ మరో కొత్త పరీక్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ వివరాలేంటో చూద్దాం.

ప్రస్తుతం కాలంలో చాలామంది ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అధికారులను, బ్రోకారులను అనుసరించి వారిని మేనెజ్ చేసి టెస్ట్ పాసవ్వకుండా.. లైసెన్స్ పొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. మరి, అలాంటి వారిని దృష్టిలో పెట్టుకున్న అడ్డదారుల్లో లైసెన్స్ పొందే పద్ధతికి చెక్ పెడుతూ మరో కొత్త పరీక్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Jul 12, 2024 | 12:12 PMUpdated Jul 12, 2024 | 12:12 PM
డ్రైవింగ్ లైసెన్స్ కు కొత్త పరీక్ష..ఇక అడ్డదారుల్లో లైసెన్స్ పొందేందుకు చెక్

ప్రస్తుతం కాలంలో యువకులు, మహిళలు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా చాలామంది వాహనాలు నడుపుతున్నారు. అయితే సాధారణంగా డ్రైవింగ్​ లైసెన్స్​పొందాలంటే నెల రోజుల పాటు డ్రైవింగ్​ సూళ్లలో శిక్షణ పొందాలి. ఆ తర్వాత ఆర్టీఏకు లైసెన్స్​ కోసం దరఖాస్తు చేస్తే వారు పెట్టే పరీక్షలో పాసైన వారికి తాత్కాలిక లైసెన్స్​ జారీ చేస్తారు. ఇక అక్కడికి ఆరు నెలల తర్వాత ఆర్టీఏ కార్యాలయాల్లోని టెస్ట్​ డ్రైవింగ్​ ట్రాక్​లో వాహనాలను నడిపి చూపిస్తేనే శాశ్వత లైసెన్స్​ ఇస్తారు. కానీ, కొంతమంది మాత్రం ఇలా ఆర్టీఏ ఆఫీసులు చూట్టూ టెస్ట్ పాసై లైసెన్స్ పొందాలంటే చాలా ఇబ్బంది, కష్టం అని భావించి కొంతమంది అడ్డదారులు తొక్కుతారు. ముఖ్యంగా సరిగ్గా వావానాలను నడపలేకపోయినా వారు కూడా అధికారులను మేనేజ్ చేస్తే చాలు లైసెన్స్ అనేది ఈజీగా బ్రోకర్లతో టెస్టు లో ఫెయిల్ కాకుండా పొందవచ్చు.ఇక ఇలా పూర్తి నైపుణ్యం లేని వారికి కూడా లైసెన్స్ జారీ అవుతున్నాయి. కానీ, ఇకపై ఆ పద్ధతులు కొనసాగవని నగరంలో తాజాగా ఆర్టిఏ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్త డ్రైవింగ్ లైసెన్స్ ను ప్రవేశపెట్టింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ఆధునీకరించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. అందుకోసం ప్రస్తుతం కొనసాగుతున్న విధానం కంటే మరింత ప్రామాణికంగా డ్రైవింగ్​ టెస్ట్​లు నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఆటోమేటిక్​ డ్రైవింగ్​ టెస్ట్​నిర్వహించేందుకు ఆర్టీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ కొత్త పద్ధతిలో రహదారులపై నిత్యం ఎదురవుతున్న వివిధ రకాల ఇబ్బందులను టెస్ట్​ ట్రాక్​పై కృత్రిమంగా కల్పిస్తారు. దీంతో టెస్ట్​ డ్రైవింగ్​కు వచ్చేవారు దొడ్డిదారిలో లైసెన్స్​పొందే పద్ధతి చెక్ పెట్టాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా   లైసెన్స్​ కోసం దరఖాస్తు చేసుకున్న వారు తప్పని సరిగా టెస్ట్​ రాయాల్సిందేనని చెప్తున్నారు. అలాగే  డ్రైవింగ్​లో బాగా శిక్షణ తీసుకుని నైపుణ్యంతో టెస్ట్​లో పాసైన వారికే లైసెన్స్​జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

లైసెన్స్ కోసం ఆర్టీఏ జారీ చేసిన కొత్త పద్ధతులు :

  • కొత్తగా ఆర్టీఏ అమలు చేయబోయే ఆటోమేటిక్​ డ్రైవింగ్​టెస్ట్​లో ఐదు రకాల ట్రాక్​లను ఏర్పాటు చేస్తారు.
  • అయితే ఇందులో ముందుగా హెచ్​ అనే ట్రాక్​ లో ఆర్టీఏ ప్రమాణాలలో పేర్కొన్న విధంగా వాహనాన్ని రివర్స్ ​చేయాలి.
  • ఆ తర్వాత ఎస్​ అనే ట్రాక్​ లో ఒక మూల నుంచి మరో మూలకు వెహికల్​ను టర్న్​చేయాలి.
  • అలాగే కె అనే ట్రాక్​ లో బాగా మలుపులు, ఎత్తుపల్లాలు, ఎత్తయిన ప్రదేశాలు, చిన్న లోయలు వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు.
  • ఇక వాటిలో వాహనాన్ని నడపి చివరగా బండిని పార్కింగ్​ చేసి చూపించాల్సి ఉంటుంది.
  • అయితే ట్రాఫిక్​ నిబంధనల ప్రకారం టూ వీలర్స్​ హెల్మెట్,​ ఫోర్​వీలర్స్​ సీటు బెల్ట్​ పెట్టుకోవాలి. ఇక ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్​లో నమోదు చేసి ఉంటుంది.
  • అలాగే లైసెన్స్‌ కోసం వచ్చిన వారు ట్రాక్​ పై వాహనాన్ని నడిపేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేసినా కంప్యూటర్​లో నమోదవుతుంది. దీంతో టెస్ట్ లో ఫెయిల్​ అయినట్టు చూపిస్తుంది.
  • ఒకవేళ టెస్ట్ లో ఫెయిల్​ అయితే మరో నెల రోజుల పాటు ట్రైనింగ్‌ తీసుకుని రమ్మంటారు.
  • ఎందుకంటే.. ఇక్కడ  పూర్తిగా కంప్యూటరీకరణ వల్ల ఇక్కడ అధికారులను సిబ్బందిని మేనేజ్​ చేసేందుకు అవకాశం ఉండదని అధికారులు తెలిపారు.
  • అంతేకాకుండా.. బ్రోకర్లకు కూడా అవకాశం ఉండదని చెప్తున్నారు.

మరి, అడ్డదారుల్లో లైసెన్స్ పొందాలనుకునే పద్ధతికి చెక్ పెడుతూ ఆర్టీఏ తీసుకువచ్చిన ఈ కొత్త ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş