iDreamPost
android-app
ios-app

Street Food: ఐస్ క్రీమ్ లో వీర్యం, పానీ పూరిలో ఉమ్ము! వీరిని శిక్షించే కొత్త నిబంధనలు?

మన ఆరోగ్యం అనేది.. మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఫుడ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా మంది తక్కువ ధరకు వస్తున్న స్ట్రీట్ ఫుడ్ పై ఆసక్తి చూపిస్తుంటారు. అయితే వీటి విషయంలో అనేక ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి.

మన ఆరోగ్యం అనేది.. మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఫుడ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా మంది తక్కువ ధరకు వస్తున్న స్ట్రీట్ ఫుడ్ పై ఆసక్తి చూపిస్తుంటారు. అయితే వీటి విషయంలో అనేక ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి.

Street Food: ఐస్ క్రీమ్ లో వీర్యం, పానీ పూరిలో ఉమ్ము! వీరిని శిక్షించే కొత్త నిబంధనలు?

ఈరోజుల్లో బయట ఫుడ్ తినేవారు ఎక్కువయ్యారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్ దగ్గర తినేవారు ఎంతమంది ఉన్నారో.. అక్కడ భరించలేని వారు బడ్జెట్ లో దొరికే స్ట్రీట్ ఫుడ్ కోసం ఎగబడతారు. మిడిల్ క్లాస్ వారి మెక్ డొనాల్డ్స్, పేదోడి కేఎఫ్‌సీలు ఈ రోడ్ సైడ్ ఉండే స్ట్రీట్ ఫుడ్ బండ్లే. పానీపూరి, బేల్ పూరి, మిరపకాయ్ బజ్జీ, టమాటా బజ్జీ, ఫ్రైడ్ రైస్ ఇలా వెరైటీ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ని తింటూ ఉంటారు. పిల్లలైతే ఐస్ క్రీమ్ లు బాగా తింటారు. అయితే కొంతమంది దుర్మార్గులు తినే ఫుడ్ లో ఏవేవో కలిపి కల్తీ చేస్తారు.

ఈ కల్తీ విషయం పక్కన పెడితే మరీ నీచంగా తినే ఫుడ్ లో ఉమ్మి వేయడం.. ఐస్ క్రీమ్ లో వీర్యం కలపడం వంటివి చేస్తున్నారు కొంతమంది. మొన్నా మధ్య పానీపూరీలో ఉమ్మి వేసిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. నిన్న ఒక వ్యక్తి పిల్లలు తినే ఐస్ క్రీమ్ లో వీర్యం కలిపాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు ఆ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ విషయంలో జనాల్లో ఆందోళన మొదలైంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లకంటే ఫుడ్ సేఫిటీ అధికారుల తనిఖీలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటారు సిబ్బంది. ఒకవేళ ఆహార తయారీ విషయంలో నాణ్యత, శుభ్రత లేనట్టు తెలిస్తే అధికారులు రెస్టారెంట్ ని సీజ్ చేస్తారు. మరి పెద్ద పెద్ద హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి ఉన్న నిబంధనలు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు ఉండవా? అనేది ఇప్పుడు ప్రశ్న.

సాధారణంగా  ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకునే ఆహారంపై మన జీవితం అనేది ఆధార పడి ఉంటుంది. ఇక వివిధ రకాల ఫుడ్ వ్యాపారాలు జరుగుతుంటాయి. ఇలా ఆహారానికి సంబంధించిన వ్యాపారలను పర్యవేక్షించేందుకు ఆహార భద్రత సంస్థ ఒకటి ఉంటుంది. ఈ శాఖకు చెందిన అధికారులు తరచూ హోటల్స్, మాల్స్, రెస్టారెంట్స్ తనిఖీలు చేస్తూ.. అక్కడ లభించే ఆహారాల నాణ్యతను చెక్ చేస్తుంటారు. ఆహార భద్రత నిబంధనలను పాటించని వ్యాపార సంస్థలపై వెంటనే చర్యలు తీసుకుంటారు. అందుకే చాలా వరకు మాల్స్, హోటల్స్ వంటివి ఫుడ్ సేఫ్టి రూల్స్ ను  కచ్చితంగా ఫాలో అవుతుంటాయి.

Man did senem and urine and in ice cream

అయితే ఇదే సమయంలో రోడ్డు సైడ్ విక్రయించే ఫుడ్ విషయంలో ఆ స్థాయిలో తనిఖీలు జరగవు. కేవలం ఏదైనా ట్రాఫిక్ కి అంతరాయం కలిగినప్పుడు మాత్రమే వారిపై నామమాత్రపు చర్యలు తీసుకుంటారు. చాలా మంది ప్రజలకు కూడా పెద్ద పెద్ద మాల్స్ లో ఎక్కువ ధరలు పెట్టలేక.. రోడ్డు సైడ్ ఫుడ్ ఐటమ్స్ ను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి చెందిన కుటుంబాల వాళ్లు రోడ్డు సైడ్ లభించే..ఐస్ క్రీమ్, పానీపూరి, బజ్జీ, ఇతర ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే.. రోడ్డు సైడ్ జరిగే  ఫుడ్ వ్యాపారమే ఎక్కువ స్థాయిలో జరుగుతుంది.

ఇలాంటి వ్యాపారుల విషయంలో అధికారులు చాలా తక్కువగా తనిఖీలు నిర్వహిస్తారనే చాలా మంది  అభిప్రాయం. అందుకే ఐస్ క్రీమ్, పానీపూరి, భోజనం వంటి వాటిని రోడ్డు సైడ్ విక్రయించే కొందరు నాణ్యతను పాటించడం లేదు. నాణ్యత పాటించకపోతే.. ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే భయం వారిలో లేదని తెలుస్తోంది. మరికొందరు సైకోల్లా ప్రవర్తించి.. అందరు తినే ఆహారాల్లో ఉమ్మి వేయడం, మూత్రం కలపడం, జంతువుల నుంచి తీసిన ఆయిల్ వాడటం వంటివి చేస్తున్నారు. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి ఘోరాలు బయట పడుతుంటాయి.

కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి పానీపూరిలో ఉమ్మి వేసి విక్రయించాడు. అది తిన్న 9 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అలానే ఇటీవల వరంగల్ జిల్లాలో  ఓ  వ్యక్తి..వీర్యాన్ని కలిపిన ఐస్ క్రీమ్ ను విక్రయిస్తున్నాడు. రోడ్డు సైడ్  నిర్వహించే బండ్ల విషయంలో కూడా ఆధికారులు కఠిన రూల్స్ తీసుకోస్తే.. ఇలాంటివి జరగవని జనాలు అభిప్రాయా పడుతున్నారు. ముఖ్యంగా ఆ ఐస్ క్రీమ్ వ్యాపారి లాంటి వారిని కఠినాతి కఠినంగా శిక్షిస్తే..మరోసారి ఇలాంటి ఘటనలు జరగవని చెబుతున్నారు. ఆహార భద్రత అధికారులు పెద్ద పెద్ద మాల్స్ లో, హోటల్స్ లో చేసినట్లు రోడ్లపై నిర్వహించే వ్యాపారాల విషయంలో చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా రోడ్డు పై అమ్ముకునే వారి విషయంలో కూడా ఆహార రూల్స్ తీసుకొచ్చి.. వాటిని అతిక్రమించిన వారిని కఠినంగా శిక్షించాలని చాలా మంది కోరుతున్నారు.