Somesekhar
Netflix planning documentary on Kumari Aunty: కుమారి ఆంటీ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోయింది. దీంతో నెట్ ఫ్లిక్స్ దృష్టి ఆమెపై పడింది. ఏకంగా ఆమె జీవితంపై డాక్యుమెంటరీని ప్లాన్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Netflix planning documentary on Kumari Aunty: కుమారి ఆంటీ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోయింది. దీంతో నెట్ ఫ్లిక్స్ దృష్టి ఆమెపై పడింది. ఏకంగా ఆమె జీవితంపై డాక్యుమెంటరీని ప్లాన్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
కుమారి ఆంటీ.. నిన్న మెున్నటి దాక ఓ సాధారణ మహిళ. కానీ నేడు.. ఓ సెలబ్రిటీ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. రోడ్డు పక్కన తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందివ్వడం ద్వారా ఫేమస్ అయిన కుమారి ఆంటీ.. తాజాగా జరిగిన పరిణామాల కారణంగా ఓ వెలుగు వెలిగింది. అదీకాక ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ స్టార్ ను సందర్శిస్తాను అని చెప్పడంతో మీడియా తాకిడి మరింతగా పెరిగింది. రోజూ పదుల సంఖ్యలో కెమెరాలు ఆమెను వెంటాడుతూ ఉండేవి. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా కుమారి ఆంటీకి చెందిన ఓ క్రేజీ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. అదేంటంటే? ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ దృష్టి కుమారి ఆంటీపై పడిందట. దీంతో ఆమెపై ఓ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తోందని సమాచారం. అయితే ఈ వార్తలో నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుమారి ఆంటీ.. ప్రస్తుతం చిన్నపాటి ఓ సెలబ్రిటీ. నిన్న, మెున్నటి దాక సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. రోడ్డు సైడ్ సాధారణ ఫుడ్ స్టాల్ నడిపే కుమారి ఆంటీకి స్థానికంగా మంచి పేరుంది. తక్కువ ధరకే నాణ్యమైన భోజనం వడ్డించడంతో.. ఆమెకు కస్టమర్లు తాకిడి ఎక్కువగా ఉండేది. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని ఆమె స్టాల్ ను మూసేయించారు పోలీసులు. ఇక ఈ వ్యవహారం సీఎం రేవంత్ దగ్గరికి వెళ్లడంతో.. ఆమెకు అండగా నిలబడటమే కాకుండా.. కుమారి ఆంటీ స్టాల్ ను సందర్శిస్తానని చెప్పడంతో గొడవ సద్దుమనిగింది. దీంతో ఆమెను ఇంటర్వ్యూలు చేయడం మెుదలుపెట్టాయి పలు యూట్యూబ్ ఛానల్స్. ఒక్కసారిగా కుమారి ఆంటీ సోషల్ మీడియా స్టార్ గా మారడమే కాకుండా.. ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది.
ఇక ఆమె క్రేజ్ కాస్త నెట్ ఫ్లిక్స్ దృష్టిలో పడిందని, అందుకే కుమారి ఆంటీపై మూడు ఎపిసోడ్ల డాక్యుమెంటరీని తీసే ఆలోచనలో ఉందని వార్తలు వైరల్ గా మారాయి. ‘ఫేమ్’ అనే పేరుతో ఆమె బాల్యం నుంచి స్టార్ట్ చేసి.. ఏపీ వదిలేసి హైదరాబాద్ రావడం, ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న అవమానాలు, కష్టనష్టాలను , ఎదుగుదలను ఈ మూడు ఎపిసోడ్స్ లో చూపిస్తారని న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇదంతా ఫేక్ న్యూస్ అని తేలింది. ఇప్పటి వరకు కుమారి ఆంటీని ఈ విషయంపై ఎవరూ కలవలేదని తేలింది. సో.. నెట్ ఫ్లిక్స్ దృష్టి కుమారి ఆంటీపై పడలేదన్నది అసలు నిజం.
ఇదికూడా చదవండి: తండ్రితో సూపర్ స్టార్ రజినీకాంత్! మీరెప్పుడూ చూసి ఉండరు!