iDreamPost

తండ్రితో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌! మీరెప్పుడూ చూసి ఉండరు!

  • Published Feb 06, 2024 | 11:49 AMUpdated Feb 06, 2024 | 12:26 PM

యాంగ్ హీరోలకు కూడా పోటిగా ఎక్కడ తగ్గని ఎనర్జీతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. తాజాగా ఈయనకు సంబంధించి ఓ అరుదైన ఫోటో అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానిని చూసిన ప్రేక్షకులు ఫీదా అవుతున్నారు.

యాంగ్ హీరోలకు కూడా పోటిగా ఎక్కడ తగ్గని ఎనర్జీతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. తాజాగా ఈయనకు సంబంధించి ఓ అరుదైన ఫోటో అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానిని చూసిన ప్రేక్షకులు ఫీదా అవుతున్నారు.

  • Published Feb 06, 2024 | 11:49 AMUpdated Feb 06, 2024 | 12:26 PM
తండ్రితో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌! మీరెప్పుడూ చూసి ఉండరు!

సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒక సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి నేడు పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు రజనీ. ఇప్పటికి ఈయన నటన, స్టైల్, మ్యానరిజం అంటే యుత్ కి బాగా ఇష్టం. అంతేకాకుండా.. ఈతరం హీరోలాకు కూడా ధీటుగా ఫుల్ జోష్ తో అలరిస్తున్నారు రజనీకాంత్. ఇక ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అడుగుపెట్టిన ఆయన.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోగా ఎదిగారు. కేవలం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అసలు సినీ పరిశ్రమ అంటేనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాలి. అలాంటిది ఈ రంగంలో నిలదక్కుకొని ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. సూపర్ స్టార్ గా కీర్తి ప్రతిష్టలు పొందారు. ఇటు తమిళ్ చిత్రాలకే పరిమితం కాకుండా.. తెలుగు చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా రజనీ కాంత్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ అరుదైన ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది.

రజనీకాంత్ గురించి ఎంతో మాట్లాడుకున్న అభిమానుల్లో అలుపు, విసుగు అనేది ఉండదు. ఎందుకంటే.. 73 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో.. తారల చిన్ననాటి ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో దర్శనమిస్తూ అందరిని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు మన సూపర్ స్టార్ కు సంబంధించిన ఓ అరుదైన ఫోటో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో రజినీ తన తండ్రితో కూర్చుని మాట్లాడుతున్నారు. కాగా, రజనీ తండ్రి పేరు రామోజీ రావు. ఇతను ఒక గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. ఇక రజినీకాంత్ బెంగుళూరులోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించారు. ఈయన అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. అయితే రజనీ ఆయన తొమ్మిదేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు.

Superstar Rajinikanth with his father

అయితే రజినీకాంత్ ఇప్పటి వరకు తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటో మాత్రం ఎక్కడ బయటకు రాలేదు. కానీ ప్రస్తుతం తన తండ్రితో కలిసి కూర్చుని ఉన్న సూపర్ స్టార్ ఫోటో అందరిని ఆకట్టుకుంది. ఇక రజనీకాంత్ గతేడాది జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నా విషయం తెలిసిందే. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కిస్తున్న ‘లాల్ సాలమ్’ సినిమాలో అదితి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో మొయిద్దీన్ భాయ్ అనే ముస్లిం వ్యక్తి పాత్రలో రజనీ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. అలాగే దీని తర్వాత.. జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేడియాన్’ అనే చిత్రన్నీ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు రజనీ. మరి, సూపర్ స్టార్ తన తండ్రితో కలిసివున్న ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి