ప్రాణంగా ప్రేమించాడు.. పెళ్లికి రెడీ అయ్యాడు! కానీ..

కొన్నాళ్ల నుండి వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. లైఫ్ కాస్త సెట్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని ప్రియురాలికి మాట ఇచ్చాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి..

కొన్నాళ్ల నుండి వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. లైఫ్ కాస్త సెట్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని ప్రియురాలికి మాట ఇచ్చాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి..

వారిద్దరూ లవర్స్. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సెటిల్ అయ్యాక మీ ఇంట్లో మాట్లాడతానని చెప్పాడు అబ్బాయి. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వచ్చిన కుర్రాడు ఓ న్యూస్ ఛానల్లో పని చేస్తున్నాడు. మంచి జీతం వస్తుంది. పెళ్లాన్ని పోషించగలన్న ధైర్యం వచ్చింది. దీంతో మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను.. నాకు ఇచ్చి పెళ్లి చేయండని అడిగాడు. కానీ ఆ అమ్మాయి తరఫు బంధువులు అంగీకరించలేదు. మా అమ్మాయిని నీకు ఇవ్వడం ఇష్టం లేదని తేల్చి చెప్పారు. కానీ ప్రియురాలు మాత్రం.. నేను అతడ్నే వివాహం చేసుకుంటానని తెగేసి చెప్పింది. పెద్దల్ని కాదని ప్రేమించిన వాడితో పెళ్లికి రెడీ అయ్యింది. అన్నీ అనుకున్నట్లే జరిగితే.. ఈ నెల 20న ఇద్దరు ఒక్కటయ్యేవారు.

కానీ వీరు ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలించిందని.. వీరి జీవితాల్లో మరోసారి నిరూపితమైంది. మార్చి 19న పెళ్లి సామాగ్రి కొనుక్కొని ఇంటికి వెళుతున్న ప్రియుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెనుక నుండి బస్సులో వస్తున్న యువతి.. ప్రమాదాన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దెబ్బడగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామానికి చెందిన తూంకుంట శంకర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. శంకర్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి.. ఓ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నాడు. కాస్త సెటిల్ కావడంతో ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.

తన తల్లిదండ్రులకు ఒప్పించాడు. కానీ యువతి బంధువులు అంగీకరించలేదు. అయినప్పటికీ ప్రేమించిన వాడే సర్వస్వం అనుకుని.. అతడితో పెళ్లికి రెడీ అయ్యింది. ఈ నెల 20వ తేదీన పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 19న పెళ్లికి అవసరమైన సామాన్లు కొనుగోలు చేసి.. ఇద్దరు స్వగ్రామానికి బయలు దేరారు. అయితే సామాన్లు కాస్త ఎక్కువ ఉండటంతో.. యువతిని బస్సు ఎక్కించారు. హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై దెబ్బడగూడ గేటు వద్ద అతడి వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో అతడు కింద పడిపోయాడు. తీవ్రగాయాలయ్యాయి. అదే దారిలో వెళుతున్న బస్సులో ఉన్న ప్రియురాలు.. బండి నంబర్ గుర్తించి బస్సును ఆపి పరుగులు తీసింది. వెంటనే 108 కాల్ చేసింది. తీవ్రగాయాలైన శంకర్.. కోమాలోకి వెళ్లిపోయాడు. చికిత్స పొందుతూ ఈనెల 21న తుది శ్వాస విడిచారు. పోలీసులు ఆ వాహనం ఎవ్వరిదన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Show comments