iDreamPost
android-app
ios-app

Seethakka: మంత్రి సీతక్క పొలిటికల్ జర్నీ! నక్సలైట్ జీవితం నుండి మంత్రిగా..

  • Published Dec 07, 2023 | 2:50 PM Updated Updated Dec 07, 2023 | 3:10 PM

Seethakka (Dansari Anasuya) Biography & Political Journey: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మహిళా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. సాధారణ ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ఆమె ఎన్నో కష్టాలను ఎదిరించి.. ప్రజల కోసం పోరాటం చేస్తూ.. ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.

Seethakka (Dansari Anasuya) Biography & Political Journey: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మహిళా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. సాధారణ ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ఆమె ఎన్నో కష్టాలను ఎదిరించి.. ప్రజల కోసం పోరాటం చేస్తూ.. ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.

  • Published Dec 07, 2023 | 2:50 PMUpdated Dec 07, 2023 | 3:10 PM
Seethakka: మంత్రి సీతక్క పొలిటికల్ జర్నీ! నక్సలైట్ జీవితం నుండి మంత్రిగా..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. కరోనా సమయంలో తన సేవలతో రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన సీతక్క.. ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీతక్క అసలు పేరు అనసూయ దంసారి. సీతక్కగా పరిచయమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలపై పోరాడుతూ.. నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్దికి పాటుపడుతుంటారు. అందుకే ఆమెను పేద ప్రజల పెన్నిధి అంటారు. డిసెంబర్ 7, గురువారం.. హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సీతక్క.

కరోనా సమయంలో సీతక్క ప్రాణాలకు తెగించి గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ.. వారికి కావాల్సిన సరుకులు స్వయంగా అందించారు. అప్పటో సీతక్క చూపించిన తెగువ సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యింది.  ఒక సామాన్య మహిళ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించి.. నేడు ఒక మంత్రి స్థాయికి ఎదిగింది. సీతక్క వరంగల్ జిల్లా ములుగు మండలం.. జగన్నపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో జులై 9, 1971 లో జన్మించింది. తండ్రి సమ్మయ్య, తల్లి సమ్మక్క దంపతులకు ఆమె రెండో సంతానం. సీతక్క ములుగు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ.. పదవ తరగతి వరకు చదువుకున్నారు. చిన్ననాటి నుంచే ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం మొదలు పెట్టారు.

Seethakka political journey

తెలంగాణ కాంగ్రెస్ లో మహిళా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆమె ఒక సెంటిమెంట్ గా మారారు అనడంలో అతిశయోక్తి లేదు. విద్యార్థి దశ నుంచే పోరాట జీవితం మొదలు పెట్టిన ఆమె.. జననాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారితో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వచ్చారు. గిరిజనులపై అటవీ అధికారుల దాష్టికం, ఆదివాసీలపై రాజకీయ నాయకులు.. వారికి సహకరిస్తూ పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై సీతక్క కన్నెర్ర చేశారు. భూస్వాముల, రాజకీయ నేతలు,వారికి తొత్తులుగా మారిన పోలీసుల ఆగడాలను ఎదుర్కోవాలంటే పోరాటం ఒక్కటే మార్గం అని ఆమె 1988 లో నక్సల్ పార్టీలో చేరారు. అప్పుడు సీతక్క వయసు 14 ఏళ్లు, పదవ తరగతి చదువుతున్నారు. నక్సల్స్ లో చేరిన తర్వాత ప్రజలకు న్యాయం చేయాలనే తన ఆకాంక్షను నెరవేర్చడం ప్రారంభించారు. అలా అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం పదిహేనేళ్ళకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు. తన బావ శ్రీరాముడిని పెళ్లి చేసుకొని తన పేరు సీతక్కగా మార్చుకున్నారు. కొడుకు పుట్టిన తర్వాత దళంలో ఉండలేక 1996 లో జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు. అప్పట్లో ఆమెకు పోలీస్, రాజకీయ వర్గాల నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా.. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ లో ఉద్యోగినిగా చేరి చదువును కొనసాగించారు.

Seethakka political journey

నెలవారి జీతం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ.. ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు సీతక్క. ప్రజా సేవ చేయాలనే ఆమె ఆకాంక్ష రాజకీయాల వైపు దృష్టి మల్లేలా చేసింది. 2004లో అసెంబ్లీ బరిలో ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఘన విజయం సాధించి.. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అలా దంసారి అనసూయ అలియాస్ సీతక్క రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎమ్మెల్యే అయిన తర్వాత సీతక్క పేద ప్రజల కష్టసుఖాల్లో స్వయంగా పాలుపంచుకున్నారు. కరోనా సమయంలో చాలా మంది నేతలు ఇళ్లకే పరిమితం అయ్యారు.. కానీ సీతక్క తన ప్రాణాలు లెక్క చేయకుండా, ప్రభుత్వ సహాయం లేకుండా తన నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతూ అహారం, నిత్యవసర వస్తువులు స్వయంగా అందజేశారు. ఒక ప్రజా ప్రతినిధి అంటే ప్రజల కోసం పని చేయాలని నిరూపించారు. అప్పట్లో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురిశాయి.

2017లో కాంగ్రెస్ లో చేరిన ఆమె 2019 లో ములుగు ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి సంచలన విజయం సాధించారు సీతక్క. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించారు. నేడు ఎల్బీ స్టేడియంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  దీంతో ములుగు నియోజకవర్గంలో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక సామాన్య మహిళ అయినా కూడా తన చుట్టూ ఉన్న ప్రజల కష్టాలపై స్పందించి.. వారి కోసం చిన్నతనంలో పోరాటం మొదలు పెట్టారు. మావోయిస్టు జీవితం నుంచి లాయర్ గా మారి రాజకీయంలో తనదైన ముద్ర వేసుకొని నేడు మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క జీవితం ఎంతో మందికి ఆదర్శం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మార్ సీతక్క జీవితంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş