హైదరాబాద్‌లో అర్థరాత్రి ముజ్రా పార్టీ.. ఢిల్లీ యువతుతో అశ్లీల డ్యాన్సులు!

Mujra Party in Hyderabad: దేశంలో యువత ఎక్కువగా పార్టీ కల్చర్ ఎంజాయ్ చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వీక్ ఎండు వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల్లో రక రకాల పార్టీలు నిర్వహిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని పార్టీలు నిబంధనలు విరుద్దంగా ప్రవర్తించడంతో పోలీసులు వారిపై కొరడా ఝులిపిస్తున్నారు.

Mujra Party in Hyderabad: దేశంలో యువత ఎక్కువగా పార్టీ కల్చర్ ఎంజాయ్ చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వీక్ ఎండు వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల్లో రక రకాల పార్టీలు నిర్వహిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని పార్టీలు నిబంధనలు విరుద్దంగా ప్రవర్తించడంతో పోలీసులు వారిపై కొరడా ఝులిపిస్తున్నారు.

ఇటీవల యూత్ పార్టీ కల్చర్ కి బాగా అలవాటు పడ్డారు. వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు పార్టీలు, పబ్బులు, రేవ్ పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీలు మాత్రమే కాదు.. గంజాయి, డ్రగ్స్ వాడుతూ అమ్మాయిలతో అసభ్య డ్యాన్సులతో రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ లో రేవ్ పార్టీలపై ఆంక్షలు ఉండటంతో నగర శివార్లు, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సీక్రేట్ ప్రదేశాల్లో రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు జరుపుతున్నారు. ఈ పార్టీలకు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను పిలిపించి అశ్లీల నృత్యాలతో రచ్చ రచ్చ రేస్తున్నారు. కొంతమంది ఇలాంటి పార్టీలు ఆర్గనైజ్ చేస్తూ లక్షలు గడిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ముజ్రా పార్టీని భగ్నం చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌజ్ లో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఈ రైడ్ లో ఆరుగురు యువకులతో పాటు నలుగురు అమ్మాయిలన అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం ఆర్గనైజర్లు ఢిల్లీ నుంచి నలుగురు అమ్మాయిలను తీసుకువచ్చినట్లు విచారణలో నిందితులు వెల్లడించారు. వీరంతా ఫామ్ హౌజ్ లో అశ్లీలంగా, అసభ్యకర రీతిలో డ్యాన్సులు చేస్తుంగా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. పార్టీ పేరుతో అశ్లీలంగా డ్యాన్సులు చేస్తున్నట్టుగా పక్కా సమాచారం రావడంతో ఎస్ఓటీ పోలీసులు దాడి నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు.

ఇటీవల రేవ్ పార్టీ, వ్యభిచారం దందాలపై ఉక్కపాదం మోపుతున్నారు పోలీసులు. రాష్ట్రంలో గంజాయి,డ్రగ్స్ మత్తు పతార్థాలను నిర్మూలించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పాఠశాలలు, కాలేజీ విద్యార్థులు డ్రగ్స్, ఈ-సిగరెట్స్, గంజాయి వంటి మత్తుకు బానిస అవుతున్నారని.. వారికి సరఫరా చేసే ముఠాలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆర్డర్ జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇలాంటి దందాలను గుర్తించేందుకు టీ న్యాబ్ సైతం ప్రత్యేక చర్యలు చేపట్టింది.  ఇప్పటికే నగరంలో రేవ్ పార్టీలను నిషేదించారు.. కానీ కొంతమంది ఆర్గనైజర్లు సీక్రెట్ గా ఈ పార్టీలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Show comments