iDreamPost
android-app
ios-app

రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఇకపై తహసీల్దార్‌లకు సూపర్ పవర్స్!

  • Published Aug 16, 2024 | 11:28 AM Updated Updated Aug 16, 2024 | 11:28 AM

Telangana ROR-2024: తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలన విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా రెవెన్యూకు సంబంధించి పలు మార్పులను తీసుకొచ్చింది. ఇక అనేక మార్పులకు  సిద్ధమవుతుంది

Telangana ROR-2024: తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలన విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా రెవెన్యూకు సంబంధించి పలు మార్పులను తీసుకొచ్చింది. ఇక అనేక మార్పులకు  సిద్ధమవుతుంది

  • Published Aug 16, 2024 | 11:28 AMUpdated Aug 16, 2024 | 11:28 AM
రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఇకపై తహసీల్దార్‌లకు సూపర్ పవర్స్!

తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలన విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా రెవెన్యూకు సంబంధించి పలు మార్పులను తీసుకొచ్చింది. ఇక అనేక మార్పులకు  సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే  రెవెన్యూలో అధికార వికేంద్రీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ ఏడాది మార్చిలో మండల, డివిజన్ స్థాయిలో అధికారులకు పలు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వ్యూలు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం ‘రికార్ట్స్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్)-2024’ డ్రాఫ్ట్ బిల్లులోనూ ‘ప్రిసైబ్డ్ ఆఫీసర్స్’ అనే అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ ప్రిసైబ్డ్ ఆఫీసర్ ద్వారా వీలైనంత ఎక్కువ సమస్యలకు పరిష్కారాలు ఎమ్మార్వో, ఆర్డీఓ స్థాయిలోనే జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డ్రాఫ్ట్ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్న ప్రభుత్వం.. అనేక సందేహాలకు సమాధానాలిస్తూనే, సవరణలు కూడా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి గైడ్ లైన్స్ రూపొందించిన తరువాతనే ఏ అధికారికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై స్పష్టత రానున్నది.

ఇదే సమయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తరువాత భూముల సమస్యల పరిష్కారం మరింత జఠిలంగా మారిందని ఆలోచనలో ప్రభుత్వం ఉంది. భూమికి సంబంధించిన పత్రాల్లోని పేరులో అక్షరం తప్పు పడినా, ఇంటి పేరు తప్పుగా వచ్చినా, ఆధార్ నంబర్ ఏమైనా చిన్న మిస్టేక్ ఉన్నా.. ఇలా ప్రతి సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ లోని సీసీఎల్ఏ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఈ క్రమంలోనే ఆర్ఐ మొదలుకొని ఎమ్మార్వో, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్ఏ వరకు అందరినీ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.

ఏ ఒక్కరినీ మెప్పించలేకపోతే అప్లికేషన్ తిరష్కరించ బడుతుంది. వీటి పరిష్కారాన్ని చాలా నెలలు, సంవత్సరా సమయం పట్టేది. అయితే ‘ఆర్ఓఆర్-2020’ చట్టంలోని అధికారాలను కేంద్రీకృతం చేయడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం భావించింది. కిందిస్థాయి అధికారులను రిపోర్టులు రాసి పంపడం వరకే పరిమితం చేశారు. అయితే తాజాగా ఎమ్మార్వో, ఆర్డీవోలకు ఈ భూ సమస్యల పరిష్కారానికి ఎక్కువ అధికారులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. చట్టం అమల్లోకి వచ్చిన తరువాత గైడ్ లైన్స్ ను అమలు చేస్తారని తెలుస్తోంది.

ఆర్ఓఆర్-2024 అమలులోకి వచ్చిన తర్వాతే ప్రతి సెక్షన్ లో పేర్కొన్న అంశాలపై పని చేసేందుకు ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్లను ప్రకటించనున్నారు. ఏ అధికారి, ఏ పనులు చేయాలన్నది గైడ్ లైన్స్ ద్వారానే స్పష్టత ఇవ్వడం సాధ్యమవుతుందని చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భూమి సునీల్ ‘దిశ’కు వివరించారు. ఇప్పటికే ప్రకటించిన సర్క్యులర్ ఒక దానికి చట్టబద్ధత కల్పించనున్నట్లు చెప్పారు. అందులో చాలా వరకు తహశీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు కట్టబెట్టారు. కొన్నింటిని కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలో పేర్కొన్నారు. వాటిలోనూ సాధ్యమైనన్ని అంశాలను తహశీల్దార్లకే కట్టబెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తుందన్నారు. ఈ మేరకు సర్క్యూలర్ ను సవరించడంతోపాటు, దానికి చట్టబద్ధత కల్పించాలన్న ఉద్దేశ్యం ఉందన్నారు. దీని ద్వారా మండల స్థాయి అధికారులకే సూపర్ పవర్స్ ఉంటాయని తెలుస్తున్నది. ప్రతి చట్టం అమలుకు ప్రత్యేకంగా రిలీజ్ చేసే గైడ్ లైన్స్ లోనే అధికారాలను కట్టబెడతారు. ఏ అధికారి, ఏ పని చేయాలి? ఎంత కాలంలో చేయాలి? అప్లికేషన్ల విధానం ఏంటి? ఇవన్నీ మార్గదర్శకాల్లోనే ఉంటుంది.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş