బిడ్డ ప్రాణాలు కాపాడటానికి అమ్మ సాహసం.. ఇదే కదా కన్న ప్రేమ!

తల్లికి తన బిడ్డకంటే లోకంలో ఏది ఎక్కువ కాదు. పిల్లల ప్రాణాల కోసం తన ప్రాణాలను ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంటారు. అందుకే తల్లి ప్రేమను మించిన ప్రేమ వేరొకటి ఉండదంటారు. అలానే ఓ తల్లి ..తన ప్రాణాలను ఫణంగా పెట్టి బిడ్డ ప్రాణాలను నిలబెట్టింది.

తల్లికి తన బిడ్డకంటే లోకంలో ఏది ఎక్కువ కాదు. పిల్లల ప్రాణాల కోసం తన ప్రాణాలను ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంటారు. అందుకే తల్లి ప్రేమను మించిన ప్రేమ వేరొకటి ఉండదంటారు. అలానే ఓ తల్లి ..తన ప్రాణాలను ఫణంగా పెట్టి బిడ్డ ప్రాణాలను నిలబెట్టింది.

ఈ  భూ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించినది, విలువైనది మరొకటి లేదు. అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. నవమాసాలు మోసి..కని పెంచడమే కాకుండా.. ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తల్లికి తన బిడ్డకంటే లోకంలో ఏది ఎక్కువ కాదు. పిల్లల ప్రాణాల కోసం తన ప్రాణాలను ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంటారు. అందుకే తల్లి ప్రేమను మించిన ప్రేమ వేరొకటి ఉండదని అంటారు. అందుకు నిదర్శనంగా అనేక ఘటనలు జరిగాయి. తాజాగా మరో సంఘటన అందరి హృదయాలను కలచివేసింది. బిడ్డను కాపాడేందుతు ఓ తల్లి కాలేయం దానం చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండవనమాల  గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల భార్యాభర్తలు.  వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి చోహన్‌ ఆదిత్య అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడు(3) పుట్టుకతోనే కాలేయ సమస్యతో బాధ పడుతున్నాడు. ఇటీవల ఆ బాలుడి కాలేయం పూర్తిగా పాడైందని.. మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. ఇక ఆపరేషన్ చేసేందుకు రూ.30 నుంచి 40 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. కూలీ పని చేసుకుంటే జీవించే ఆ కుటుంబం అంత డబ్బు పెట్టలేని పరిస్థితి లేక ఆందోళన చెందారు. ఇదే సమయంలో తెలిసిన వారు, మరికొందరు ఇచ్చే సలహాలను ఉస్మానియా వైద్యులకు వివరించారు.  వైద్యులు కూడా  దంపతులు చెప్పిన విషయానికి ఓకే అన్నారు.

దీంతో  చిన్నారికి కాలేయం ఇచ్చేందుకు అతడి తల్లి అమల దాతగా ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే ఉస్మానియా హాస్పిటల్ సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు మధుసూదన్‌, ఆయన బృందం జులై 3న ఎంతో క్లిష్టమైన కాలేయం మార్పిడి సర్జరీని  చేశారు. ఈ చికిత్స ఎంతో విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం తల్లి, కుమారుడు పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.  అదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.10.8 లక్ష అందించారు. అలానే ఇలా వైద్య ఖర్చుల కోసంమరో రూ.2 లక్షలు చిన్నారికి వైద్యులు అందించారు. ఇక ఆ చిన్నారికి విజయవంతంగా కాలేయ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్యులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. మరి..తన ప్రాణాలను ఫణంగా పెట్టి..బిడ్డ ప్రాణాలను కాపాడిన ఆ తల్లిపై అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Show comments