iDreamPost
android-app
ios-app

వక్ఫ్ బోర్డు భూముల కబ్జా ఆరోపణలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్!

  • Published Aug 01, 2023 | 6:27 PM Updated Updated Aug 01, 2023 | 6:27 PM
  • Published Aug 01, 2023 | 6:27 PMUpdated Aug 01, 2023 | 6:27 PM
వక్ఫ్ బోర్డు భూముల కబ్జా ఆరోపణలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్!

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వక్ఫ్ బోర్డు భూముల కబ్జా చేశారంటూ గత కొన్ని రోజుల నుంచి అతనిపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇతనిపై వస్తున్న ఆరోపణలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తాజాగా స్పందించి ప్రతిపక్ష నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్ని రోజుల నుంచి కొందరు నాయకులు నేను గౌడ్ వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేశానంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ మీరు అన్నట్లు నేను నిజంగా వక్ఫ్ బోర్డు భూముల కబ్జా చేశానని నిరూపించే దమ్ముందా మీకుందా? ఎవరైనా నిరుపిస్తే.. నేను దేనికైనా సిద్దం. మమ్మల్నీ రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు కులం చూసి గెలిపించలేదు, మా గుణం చూసి గెలిపించారు.

అధిక మెజార్టీతో గెలిచిన మాపై ప్రతిపక్ష నాయకులు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక మాయమాటలు చెప్పి ప్రజల ఓట్లు సంపాదించలేరని, ప్రజల మన్ననలు పొందితేనే ఎన్నికల్లో గెలుస్తారు. అసలు మా బీఆర్ఎస్ నాయకులపై మీకు ఎందుకు అంత అక్కసు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. దీంతో గత కొంత కాలం నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై వస్తున్న వక్ఫ్ బోర్డు భూముల కబ్జా ఆరోపణలపై తాజాగా మీడియా సమావేశంలో ఆయన ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్‌.. వారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet