P Venkatesh
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలో డీఎస్సీ నిర్వహణపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలో డీఎస్సీ నిర్వహణపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
P Venkatesh
తెలంగాణలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకుని యువత టీచర్ రిక్రూట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్ లో ఉపాధ్యాయుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రైమరీ, సెకండరీ పాఠశాలల్లో కలిపి మొత్తం 5 వేలకు పైగా ఖాళీలకు డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. అయితే తాజాగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణలో మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని మంత్రి వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ రిక్రూట్ మెంట్ కోసం ఉద్యోగార్థులు ఎదురు చూస్తున్నారు. డీఎస్సీ కోసం ఎప్పటి నుంచో సన్నద్ధమవుతున్నారు. అయితే తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన పోస్టులకు అదనంగా మరిన్ని పోస్టులను పెంచి మెగా డీఎస్సీ నిర్వహించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి డీఎస్సీపై క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. మంత్రి ప్రకటనతో తెలంగాణలో డీఎస్సీ నిర్వహణపై కొంత స్పష్టత వచ్చినట్లైంది.
మంత్రి చేసిన ప్రకటనతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో గడచిన 10 ఏళ్లలో టీచర్ రిక్రూట్‌మెంట్ జరగలేదని మంత్రి తెలిపారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాట్ఉ చేస్తామని వెల్లడించారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించారు. ఇటీవల సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించన సీఎం రేవంత్ ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. మరి తెలంగాణలో ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నోటిఫికషన్ విడుదల చేస్తామని మంత్రి చేసిన ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.