iDreamPost
android-app
ios-app

Holidays: స్కూళ్లు, కాలేజీలకు 4 రోజులు సెలవులు.. ఆ జిల్లాల వారికి మాత్రమే

  • Published Feb 20, 2024 | 11:32 AM Updated Updated Feb 20, 2024 | 11:41 AM

తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు 4 రోజులకు సెలవులు ప్రకటించింది. అయితే అవి అందరికి వర్తించవు. ఆ వివరాలు..

తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు 4 రోజులకు సెలవులు ప్రకటించింది. అయితే అవి అందరికి వర్తించవు. ఆ వివరాలు..

  • Published Feb 20, 2024 | 11:32 AMUpdated Feb 20, 2024 | 11:41 AM
Holidays: స్కూళ్లు, కాలేజీలకు 4 రోజులు సెలవులు.. ఆ జిల్లాల వారికి మాత్రమే

స్కూల్‌, కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్రంలోని అందరికి ఈ సెలవులు వర్తించవు. కొన్ని జిల్లాల వారికి మాత్రమే. ఇంతకు మరి ఈ 4 రోజుల సెలవులు ఎందుకు.. ఎక్కడ అంటే.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మేడారం జాతర ప్రసిద్ధి గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మేడారం జాతర జరిగే ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో ములుగు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతరగా మేడారం జాతర ప్రసిద్ధికెక్కింది. రేపటి నుంచి అనగా ఫిబ్రవరి 21 నుంచి వనదేవతల జాతర ప్రారంభం కానుంది. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కాలినడకన, ఎడ్లబండ్ల మీద మాత్రమే కాదు హెలికాప్టర్ లోనూ మేడారం జాతరకు భక్తులు వస్తారంటే దాని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ మహా జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు నడుపుతున్నందున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రయాణికులు సహకరించాలని పొన్నం కోరారు.

అలానే హైదరాబాద్, హనుమకొండ నుంచి హెలికాప్టర్‌లో వెళ్లి మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే వీలు కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా హెలిటాక్సీ సంస్థ.. తెలంగాణ ప్రభుత్వం, బెంగళూరుకు చెందిన తుంబీ ఏవియేషన్‌ సహకారంతో హెలికాప్టర్‌ సేవలను అందించేందుకు రెడీ అయ్యింది. ఈనెల 21 నుంచి 25 వరకు ఈ సంస్థ హెలికాప్టర్‌ సేవలు అందించనుంది. అలానే ఈ జాతరకు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే వారి కోసం పోలీస్‌‌ శాఖ రూట్‌ మ్యాప్‌ను ప్రకటించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా మేడారం చేరుకునేందుకు ఈ రూట్ మ్యాప్‌ను వెల్లడించారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetador girişgrandpashabet