iDreamPost
android-app
ios-app

వీడియో: భార్యలకు సీటు కోసం బస్సులో పొట్టు పొట్టు కొట్టుకున్న భర్తలు.. ఎక్కడంటే

  • Published Apr 24, 2024 | 10:20 AM Updated Updated Apr 24, 2024 | 10:20 AM

భార్యలకు ఆర్టీసీ బస్సులో సీటు కోసం భర్తలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

భార్యలకు ఆర్టీసీ బస్సులో సీటు కోసం భర్తలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

  • Published Apr 24, 2024 | 10:20 AMUpdated Apr 24, 2024 | 10:20 AM
వీడియో: భార్యలకు సీటు కోసం బస్సులో పొట్టు పొట్టు కొట్టుకున్న భర్తలు.. ఎక్కడంటే

భార్యాభర్తలు నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నా.. నలుగురిలో మాత్రం ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకోవాలి. అప్పుడే వారిని బయటి వారు గౌరవిస్తారు. ఈ విషయంలో ఆడవారు చాలా గ్రేట్‌. ఇంట్లో భర్తతో ఎన్ని గొడవలు పడ్డా.. బయట, తమ బంధువులు, పుట్టింట్లో భర్తకు ఎంతో గౌరవం ఇస్తారు.. ఇచ్చేలా ప్రవర్తిస్తారు. భర్తకు అవమానం జరిగితే ఏ భార్య తట్టుకోలేదు. కానీ మగవారి విషయానికి వస్తే.. ఈ సూత్రాన్ని చాలా తక్కువ మంది పాటిస్తారు. భార్య అంటే వారికి పని చేసే పెడుతూ.. తిట్టినా, కొట్టినా పడి ఉండే ఓ బానిస. నలుగురిలో కాదు కదా.. కనీసం తమ కుటుంబ సభ్యుల మధ్య కూడా భార్యకు కనీస గౌరవం ఇవ్వని మగాళ్లు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వెలుగు చూసిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.

భార్యల కోసం భర్తలు.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అది కూడా బస్సులో సీటు కోసం ఈ గొడవ జరిగింది. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక బస్సు ఎక్కిన ఇద్దరు మగాళ్లు.. నా భార్యకు సీటు కావాలంటే.. లేదు నా భార్యకే సీటు కావాలంటూ గొడవకు దిగారు. వీరికి మద్దతుగా భార్యలు కూడా రంగంలోకి దిగడంతో గొడవ తారాస్థాయికి చేరింది. అంతసేపు ఒకరిని ఒకరు మాటలు అనుకున్న వారు.. ఇక కొట్టుకునే స్టేజ్‌కు వచ్చారు. భార్యల కోసం.. ఆ భర్తలిద్దరూ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక ఈ గొడవ జరిగింది ఎక్కడో కాదు.. తెలంగాణలోనే. కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పథకం తర్వాత బస్సులో సీటు కోసం ఆడాళ్లు కొట్టుకునే ఘటనలు చూశారు. ఇక తాజాగా భార్యల కోసం.. భర్తలు కొట్టుకోవడం సంచలనంగా మారింది. ఈ సంఘటన మహబూబాబాద్‌లో వెలుగు చూసింది. తొర్రూర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న బస్సులో భర్తలు తమ భార్యలకు సీటు కోసం కర్చీఫ్‌ వేశారు.

ఒకరు ఆపిన సీటులో మరొకరు కూర్చుకోవడంతో మహిళలు దారుణంగా తిట్టుకున్నారు.. ఈ వాదనలు భర్తల వరకు వెళ్లడంతో వారు కూడా రంగంలోకి దిగారు. ముందుగా మాటలతో మొదలైన ఈ గొడవ.. చివరకు చెప్పులతో కొట్టుకొనేవరకు వెళ్లింది. ఇక తోటి ప్రయాణికులు వారిని ఆపే ప్రయత్నం చేసినా.. వారు ఆగలేదు. కొందరైతే ఈ గొడవను వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş