ఎలక్షన్ రిజల్ట్: హైదరాబాద్‌లో మాధవీలత ముందంజ

Madhavilatha: దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే చర్చ సాగుతుంది. ప్రతి ఒక్కరూ టీవీలు, సెల్ ఫోన్లకు అతుక్కుపోయారు.

Madhavilatha: దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే చర్చ సాగుతుంది. ప్రతి ఒక్కరూ టీవీలు, సెల్ ఫోన్లకు అతుక్కుపోయారు.

దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న లోక్ సభ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లెక్కింపు మొదలైంది. కేంద్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోరు కొనసాగుతుంది. మే 13న తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలపై ప్రజలు, నాయకులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఈసారి ఎఐఎం వర్సెస్ బీజేపీ మధ్య పోటీ హూరా హూరీ సాగుతుందని ముందు నుంచి అనుకుంటున్నారు. ఎఐఎం తరుపు అసదుద్దీన్ ఒవైసీ పోటీలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి మాధవీలత పోటీలో ఉన్నారు. దీంతో హైదరాబాద్ ఎన్నికల్లో ఈసారి కొత్త ట్రెండ్ కొనసాగబోతుందా అని చర్చలు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో ఉదయం 8.40 వరుకు వచ్చిన సమాచారం మేరకు హైదారాబాద్ లో బీజేపీ అభ్యర్థి మాధవీ లత  సిట్టింగ్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కన్నా ముందంజలో ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థికి మాధవీలత గట్టి పోటీ ఇస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆరు స్థానాల్లో ముందుంజలో కొనసాగుతుంది. కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, మల్కాజ్ గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, వరంగల్ లో ఆరూరి రమేష్ 242 ఆధిక్యంలో కొనసాగుతుంది.

Show comments