MLC కవితకు సుప్రీం కోర్టులో చుక్కెదురు!

MLC Kavitha Liquor Scam: ప్రస్తుతం ఢిల్లీ మద్యం పాలసీ కేసు దేశ వ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన కవితకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.

MLC Kavitha Liquor Scam: ప్రస్తుతం ఢిల్లీ మద్యం పాలసీ కేసు దేశ వ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన కవితకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.

దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు పెను సంచలనంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. టోకు వర్తకులకు అధిక లాభాలు పొందేలా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ విధానాన్ని రూపొందించింది. ఈ పాలసీలో ఎన్నో అవకతవకలు జరగడంతో ఈ పాలసీని రద్దు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. కానీ ప్పటికే 2022 ఆగస్టు 17న సీబీఐ తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసులో కీలక వ్యక్తులను అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కవితకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి.. ఊరట కోసం ప్రయత్నిస్తున్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. శుక్రవారం ఆమె పిటీషన్ ను కొట్టేసింది. ఈ కేసులో ప్రస్తుతం విచారణ చేయలేమని.. రాజకీయ నాయకులైనంత మాత్రాన ప్రత్యేక విచారణ ఉండదని తేల్చి చెప్పింది. అంతేకాదు ట్రయల్ ఎదుర్కొని తీరాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ‘చట్టం ఎవరికైనా ఒకటే.. పొలిటీషియన్స్ కి ప్రత్యేక విచారణ ఉండదు. రిట్ పిటీషన్ లో లేవనెత్తే అంశాలను విజయ్ మదన్ లాల్ కేసుతో కలిపి విచారణ జరుపుతాం.. ఈ కేసులో పిటిషనర్ (కవిత) ట్రయల్ ఎదుర్కొవాల్సిందే’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టీస్ బేలా, జస్టిస్ సుందరేష్ త్రివేదిలతో కూడి ధర్మాసనం తేల్చి చెప్పింది.

కవిత వేసిన రిట్ పిటిషన్ కు సంబంధించి.. ఆరు వారాల్లో కౌంటర్ ఫైల్ చేయాలని ఈడీకి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో పిటీషన్ వేయాలని కవిత న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. మహిళ కనుక ట్రయల్ కోర్టులో వీలైనంత త్వరగా నిర్ణయించాలిన ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కవిత ఈ నెల 23వ తేదీన తిరిగి కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉంది. సుప్రీం కోర్టు చేసిన సూచనతో కవిత మళ్లీ రౌస్ అవెన్యూ కోర్టులోనే పిటీషన్ వేయాల్సి ఉంటుంది. తాజాగా ఈ కేసులో ఢిల్లీ సీఎం క్రేజీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Show comments