హైదరాబాద్ వాసులకు అలెర్ట్..నగరంలోకి ప్రవేశించిన చిరుత!

Leopard Hyderabad: ఈ మధ్యకాలంలో వన్యమృగాలు జనవాసల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా అడవుల్లో ఉండాల్సిన కూరమృగాలు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోకి చిరుత ప్రవేశించింది.

Leopard Hyderabad: ఈ మధ్యకాలంలో వన్యమృగాలు జనవాసల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా అడవుల్లో ఉండాల్సిన కూరమృగాలు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోకి చిరుత ప్రవేశించింది.

ఇటీవల కాలంలో వన్యమృగాలు జనవాసల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా అడవుల్లో ఉండాల్సిన కూరమృగాలు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా అటవీ సమీపంలో ఉన్న నగరాలు, గ్రామాల్లో కూర మృగాల సంచారం బాగా పెరిగింది. అలానే వీటి దాడిలో పలువురు మృతి చెందగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలే శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బండి దాడి చేయగా ఇద్దరు మృతి చెందారు. తాజాగా ఏకంగా హైదరాబాద్ నగరోంలనే చిరుత సంచారం అందరిలో కలకలం రేపుతోంది. నగరంలోని ఆ ప్రాంతాల వాసులు అలెర్ట్ గా ఉండాలి. మరీ.. వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

శనివారం హైదరాబాద్ లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్‌ పోర్ట్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది.. రన్‌వేపై చిరుతను గుర్తించారు. ఆ సమయంలో చిరుత ఇంకా ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లోనే సంచరిస్తున్నట్టు  వారు గుర్తించారు. చిరుత సంచారం గురించి సమాచారం అందుకున్న వైల్డ్‌లైఫ్ విభాగం సిబ్బంది, జూ అధికారులు.. శంషాబాద్‌ విమానాశ్రయం వద్దకు చేరుకున్న ఆ పరిసరాల్లో చిరుత కోసం గాలించారు. ఇక, చిరుత సంచారం గురించి తెలుసుకున్న ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది బిక్కబిక్కుమంటు గడిపారు.. ఆ చిరుత కదలికలు సీసీపుటేజీలో చిక్కడంతో ఆందోళన కలిగిస్తోంది.  శంషాబాద్ నుంచి చిరుత రింగ్ రోడ్డులోపలికి ప్రవేశించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తొలుత ఏప్రిల్ 27, శనివారం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చిరుతపులి కనిపించింది. అక్కడ ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ సెక్షన్‌లోని కంచెపై నుంచి దూకేందుకు చిరుత ప్రయత్నించింది. ఆ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సమ్మర్ సీజన్ లో రాజేంద్ర నగర్ పరిధిలోని శంషాబాద్‌, యాచారం, మొయినాబాద్‌, అలానే అటవీ ప్రాంతం ఉన్న సంగారెడ్డి జిల్లాలో చిరుతపులులు కనిపిస్తుంటాయి. చిరుత పులులు ఆహారం, నీటి కోసం జనవాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. ఇవి ఎక్కువగా వీధి కుక్కలను వెంటాడుతాయి. అప్పుడప్పుడు మనుషులపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.

తాజాగా అలానే ఈ సారి ఎండకాలం కూడా శంషాబాద్ పరిధిలో చిరుత సంచారం కనిపించింది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుతపులిని బంధించేందుకు ప్రత్యేక బోను ఏర్పాటు చేశారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు కోరారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలానే ఎక్కడైనా చిరుత ఆనవాళ్లు కనిపిస్తే  వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. మొత్తంగా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అలెర్ట్ గా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

Show comments