P Krishna
తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రచారాల జోరు కనిపిస్తుంది. ఓ వైపు పండుగ వాతావరం.. మరోవైపు ఎన్నికల ప్రచారాలతో తెలంగాణ అంతటా కోలాహలంగా ఉంది. కొన్ని చోట్ల టికెట్ దక్కని అసంతృప్తి నేతలు సీనియర్ నేతలపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు.
తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రచారాల జోరు కనిపిస్తుంది. ఓ వైపు పండుగ వాతావరం.. మరోవైపు ఎన్నికల ప్రచారాలతో తెలంగాణ అంతటా కోలాహలంగా ఉంది. కొన్ని చోట్ల టికెట్ దక్కని అసంతృప్తి నేతలు సీనియర్ నేతలపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు.
P Krishna
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది.. ఈసారి సీఎం పీటం దక్కించుకోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు గట్టి పట్టుమీదే ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ తరుపు సీఎం కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లీ మరో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు అధికార పార్టీ తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేస్తూ..కుటుంబ పాలన కొనసాగిస్తు కోట్లు దండుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ ఒక్కసారి తమకు ఛాన్సు ఇస్తే.. తెలంగాణను అభివృద్ది పథంలోకి తీసుకువెళ్తామని గ్యారెంటీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ 55 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ములుగు నుంచి జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బస్సు యాత్రతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ఎన్నికల ప్రచార సభలో మాజీ మంత్రి జానా రెడ్డి సహనం కోల్పోయారు.. గిరిజనులపై తిట్లదండకం అందుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణలో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ తన ప్రచారంతో ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తున్నారు. వరుసగా నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకలు బస్సు యాత్రతో ప్రచారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 20న నిజామాబాద్ లో మీటింగ్ భారీ బహిరంగ సభ ఉండగా.. అత్యవసరంగా రాహుల్ గాంధీ.. ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ ముఖ్యనేతలు తమ తమ నియోజకవర్గాల్లో ముమ్ముర ప్రచారం కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల అసంతృప్తి నేతలు పార్టీ ముఖ్యనేతలపై తీవ్ర ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నెత, మాజీ మంత్రి జానా రెడ్డి గిరిజన సభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీనియర్ నేత జానారెడ్డి తన నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సభలో కార్యకర్తలను ఉద్దేశించి జానారెడ్డి మాట్లాడుతున్న సమయంలో పలువురు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ ప్రాంతంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, తమకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని కొంతమంది గిరిజనులు అడగడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.. సహనం కోల్పోయిన జానారెడ్డి.. ‘ఎవడ్రా వాడు బయటికెళ్లు.. తోసెయండ్రా వాడ్ని’ అంటూ సీరియస్ అయ్యారు. అదే సమయంలో ఎదురుగా కొంతమంది కార్యకర్తలతో కూడా దురుసుగా మాట్లాడారు. అన్ని ఊళ్లూ తిరుగుతున్నాం.. మా కష్టాలు మాకున్నాయి అంటూ ఫైర్ అయ్యారు. నేను మళ్లీ చెబుతున్నా.. కాంగ్రెస్ పార్టీతో ఉండాలనుకునేవాళ్లు, నాతో మాట్లాడలనుకునేవాళ్లు సైలెంట్ గా ఉండాలి.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేంగా మాట్లాడేవాళ్లు వెళ్లిపోవాలి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎన్నికల సమయంలో సహనంతో ఉండాల్సిన సీనియర్ నేతలు గిరిజనుల పట్ల ఇలా దురహంకారం ప్రదర్శించడం తీవ్ర నష్టం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సహనం కోల్పోయిన జానారెడ్డి.. గిరిజనుల మీద తిట్ల దండకం అందుకున్న జానారెడ్డి pic.twitter.com/dLB3vMLa5j
— Telugu Scribe (@TeluguScribe) October 23, 2023