వారికి KCR శుభవార్త.. త్వరలోనే రూ. 3 లక్షలు సాయం.. పూర్తి వివరాలివే!

మరికొన్ని నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి. హ్యాట్రిక్‌ కొట్టాలని బీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించడం, ఉన్న వాటిని పరుగులు పెట్టించడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్‌ సర్కార్‌ ఓ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పేదలందరికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాక తాజాగా కేసీఆర్‌ గృహలక్ష్మి పథకాన్ని కూడా తీసుకువచ్చారు. దీనిలో భాగంగా సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకున్నవారికి.. రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా గృహలక్ష్మి పథకానికి సంబంధించి కేసీఆర్‌ సర్కార్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

సొంత జాగా ఉండి ఇళ్లు నిర్మించుకోవాలని భావించే పేదలకు ఈ గృహలక్ష్మి పథకం కింద రూ. 3లక్షల ఆర్థిక సాయం చేసేందుకు కేసీఆర్‌ సర్కార్‌ ముందుకు వచ్చింది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం గత నెల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా లేదా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రికి నేరుగా సమర్పించవచ్చు. ఈ పథకానికి జిల్లాల్లో కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ పరిధిలో కమిషనర్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. ఈ పథకం కోసం రాష్ట్ర గృహ నిర్మాణశాఖ అధ్వర్యంలో సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సహకారంతో ప్రత్యేక పోర్టల్‌తో పాటు మొబైల అప్లికేషన్‌ను కూడా అభివృద్ధి చేశారు.

ఇక ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ మొదలు.. బిల్లుల మంజూరు ప్రక్రియ వరకు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. నిర్దేశించిన సంఖ్యకు మించి దరఖాస్తులు వస్తే.. వెయిటింగ్‌ లిస్ట్‌ రూపొందించనున్నారు. ఇక ఈ పథకం కింద మంజూరు చేసే ఇళ్లను మహిళ పేరునే ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. మూడు దశల్లో ఇంటి నిర్మాణం కోసం నిధులు విడుదల చేస్తారు. గృహలక్ష్మి పథకం అ‍మలు కోసం కేసీఆర్‌ సర్కార్‌ 12 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. అంతేకాక ప్రతి నియోజకవర్గంలో 3 వేల చొప్పున ఈ ఏడాదిలో సుమారు 4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా ప ఎట్టుకుంది.

Show comments