iDreamPost
android-app
ios-app

వీడియో: మరో 6 నెలల్లో KCR సీఎం అవుతారు.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

  • Published Dec 04, 2023 | 1:14 PM Updated Updated Dec 04, 2023 | 1:14 PM

కడియం శ్రీహరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మరో 6 నెలల్లో KCR సీఎం అవుతారని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది.

కడియం శ్రీహరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మరో 6 నెలల్లో KCR సీఎం అవుతారని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది.

  • Published Dec 04, 2023 | 1:14 PMUpdated Dec 04, 2023 | 1:14 PM
వీడియో: మరో 6 నెలల్లో KCR సీఎం అవుతారు.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢాంకా మోగించిన విషయం విషయం తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ ను సైతం దాటేసి 119 నియోజకవర్గాలకు గానూ 64 స్థానాలు గెలుపొంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. అయితే, బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం 39 సీట్లకు పరిమితమైంది. దీంతో ఈ ఓటమిని బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి వరంగల్ లోని స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు కడియం శ్రీహరి. ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇంతకు కడియం చేసిన ఆ సంచలన కామెంట్స్ ఏంటంటే?

కడియం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాలేదని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మళ్లీ ఆరు నెలలు, ఏడాది , మూడు సంవత్సరాలు అనేది చెప్పలేం కానీ.. మళ్లీ ప్రభుత్వం మనదే, మన ముఖ్యమంత్రి కేసీఆరే. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ సీట్లు వచ్చాయి. మరి వాళ్లు కాపాడుకుంటారో లేదో చూడాలి. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజల తీర్పును మనమంతా స్వాగతించాలి. ఇకపోతే, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పటిష్టమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని కడియం శ్రీహరి అన్నారు. తాజాగా ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇంతకు కడియం ఏ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందనే విషయం తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరో 6 నెలల్లో KCR సీఎం అవుతారన్న కడియం శ్రీహరి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabettaraftarium24 girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom