గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే..!

దేశంలో ఉన్న ప్రతి నిరుపేదకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యమైనదని తెలిసిందే. ప్రభుత్వాలు అందించే ప్రతి పథకానికి ఖచ్చితంగా రేషన్ కార్డు అవసరం ఉంటుంది.

దేశంలో ఉన్న ప్రతి నిరుపేదకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యమైనదని తెలిసిందే. ప్రభుత్వాలు అందించే ప్రతి పథకానికి ఖచ్చితంగా రేషన్ కార్డు అవసరం ఉంటుంది.

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన పాలన మొదలు పెట్టారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీ పథకాలు అమలు చేశారు. మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ. అంతేకాదు పేద ప్రజలకు మరో శుభవార్త అందించారు. ఎంతోకాలంగా తెలంగాణాలో ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 89.98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో జాతీయ ఆహారభద్రత చట్టం కింద జారీ అయిన కార్డులు 54.39 లక్షలు. ఇక రాష్ట్రం తరుపు నుంచి 35.59 లక్షల కార్డులు ఉన్నాయి. అర్హులపై పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

పేద ప్రజలకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యమైంది. ప్రభుత్వ ఇచ్చే వివిధ పథకాలకు రేషన్ కార్డు చాలా అవసరం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం ఎంతోమంది నిరుపేదలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు ప్రభుత్వం సంసిద్దం అవుతుంది. మీ – సేవ ద్వార ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిసింది. గతంలో రేషన్ కార్డు జారీ విషయంలో అవకతవకలు జరిగాయని.. ఉన్నత కుటుంబీకులు, ఉద్యోగస్థులు సైతం రేషన్ కార్డులు దరఖాస్తులు చేసుకున్నారని.. ఈ నేపథ్యంలోనే అర్హుల ఎంపిక ప్రక్రియ క్షేత్రస్థాయిలో చేపట్టేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.

ఆన్ లైన్ లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసిన తర్వాత వీటి పరిశీలన ఉంటుందని.. అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో గ్రామసభలు, నగరాలు, పట్టణాల్లో బస్తీ సభల ద్వారా ఎంపిక జరుగుతుందని పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఈ ప్రక్రియ సమయంలో ప్రత్యేకంగా నోడల్ అధికారులను కూడా నియమించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా ఈ నెల 28 వ తేదీ నుంచి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తునట్లు తెలుస్తుంది. కొత్త కార్డుల దరఖాస్తు తో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో సవరణలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. గత కొంత కాలంగా రేషన్ కార్డుల్లో కొత్త మెంబర్లు జాయిన్ చేయాలని.. ఈ మేరకు 11.02 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఎడిట్ ఆఫ్షన్ ఇవ్వకపోవడంతో దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments