CM రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం.. వారికి ఉచితంగా వైద్యం!

Heavy Rains in Telangana: తెలంగాణలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

Heavy Rains in Telangana: తెలంగాణలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

తెలంగాణలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 11 జిల్లాల్లో మరో రెండు రోజల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాల్లో కలెక్టర్లరు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

రాష్ట్రంలో ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా అనారోగ్యాలతో బాధపడుతునన నిరుపేదలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో వెంటనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి రాజ నరసింహ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితి వల్ల చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. జ్వరం, జలుబు, డయేరియా ఇతర రోగాల భారిన పడే అవకాశం ఉందని అన్నారు మంత్రి రాజ నరసింహ్మ.

రాష్ట్ర వ్యాప్తగా వరద ప్రాంతాల్లో  మెడికల్ క్యాంప్‌లో సాధ్యమైనంత వరకు పరీక్షలు చేసి, మందులు ఇవ్వాలని వైద్యులకు సూచించారు. ఇప్పటికే వరదల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటి వారికి సరైన ట్రీట్ మెంట్ అవసరం అని అన్నారు. ప్రజలు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెడికల్ క్యాంప్ లో వరద బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారని మంత్రి రాజనరసింహ్మా అన్నారు.

Show comments