తెలంగాణకు బిగ్ అలర్ట్.. 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Hyderabad Report On Heavy Rains In Telangana: తెలంగాణ రాష్ట్రంలో వారం రోజులపాటు ముసురు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.

IMD Hyderabad Report On Heavy Rains In Telangana: తెలంగాణ రాష్ట్రంలో వారం రోజులపాటు ముసురు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఏదో ఒకచోట వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడప్పుడే ఈ వానలు వదిలేలా కనిపించడం లేదు. ఆగస్టు 29న కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందుకు కారణం బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా.. రాష్ట్రాన్ని మరో 5 రోజులు వర్షాలు వదిలే పరిస్థితి కనిపించడం లేదు. అది కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో రేపటి నుంచి (ఆగస్టు 30) అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

వచ్చే నాలుగు రోజుల్లో ఒక్క జిల్లా అని కాదు.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వారం రోజులు ముసురు పట్టే అవకాశం ఉంది. అంటే ఏదో ఒక సమయంలో వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఎడతెరిపిలేకుండా వానలు కురవడం అనమాట. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట్, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, సూర్యాపేట్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఎక్స్.కామ్ లో తెలంగాణ వాటర్ మ్యాన్ పేజ్ లో పోస్ట్ చేశారు.

నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ నాలుగు రోజులు మాత్రం జోరుగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఐఎండీ హైదరాబాద్ అధికారులు కూడా వచ్చే ఐదురోజులు వర్షాలు విస్తారంగా కురుస్తాయని హెచ్చరించిన విషయం తెలిసిందే. కేవలం వర్షాలు మాత్రమే కాకుండా.. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంటుంది. గంటకు 27 నుంచి 41 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంటుంది. అలాగే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కూడా లేకపోలేదు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంటుంది. అందుకే.. పశువులు, గొర్ల కాపరులు, పొలాలకు వెళ్లే కూలీలు కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Show comments