Swetha
HYDRA Demolitions: ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువులు ,కుంటలు , ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి కట్టడాలు ఉన్నా కూడా క్షణాల్లో నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వారి ఇంటి రుణాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
HYDRA Demolitions: ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువులు ,కుంటలు , ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి కట్టడాలు ఉన్నా కూడా క్షణాల్లో నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వారి ఇంటి రుణాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
హైదరాబాద్ లో చెరువులు, కుంటలు , ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను.. క్షణాల్లో కూల్చేస్తున్నారు అధికారులు. అలాంటి పెద్ద పెద్ద భవనాలను కూల్చివేయడంలో హైడ్రా బుల్డోజర్లు దూసుకుపోతున్నాయి. వారు సామాన్యుల , సెలెబ్రిటీల అనే తేడా లేకుండా అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా.. బఫర్ జోన్ కిందికి వస్తుందా అనే దానిపై మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పడు చూస్తూనే ఉన్నాము. ఇక తాజాగా కూకట్ పల్లి, అమీన్ పూర్ పరిధిలో భవనాలను కూల్చివేయగా.. అందులో చాలా వరకు సామాన్యులే ఉండడంతో.. ఈ విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా హోమ్ లోన్స్ తీసుకుని మరి ఇళ్ళు కట్టుకున్న వారి విషయంలో.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తాజాగా జరిగిన హైడ్రా కూల్చివేతల్లో.. బ్యాంక్ లోన్స్ తీసుకుని మరీ ఇళ్ళు కట్టుకున్న బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారం క్రితమే గృహప్రవేశం చేశామంటూ.. మూడు రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ అయిందంటూ.. ఇలా అనేక మంది మీడియాతో వాపోతున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక వారు వాపోయిన బ్యాంక్ లోన్స్ విషయానికొస్తే.. ఇకపై అక్రమ నిర్మాణాలకు బ్యాంక్ లోన్స్ ఇవ్వకుండా ఉండేందుకు.. హైడ్రా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై హైడ్రా కమిషనర్.. బ్యాంకర్స్ తో ఈ విషయాన్నీ చర్చించనున్నారు. ఇక ఇదే విషయాన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులకు కూడా హైడ్రా లేఖ రాసింది. కాగా ఈ సమావేశంలో బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ జోన్లలో జరిగే అక్రమ నిర్మాణాలను నిరోధించేందుకు.. రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
అంతే కాకుండా.. ఇటీవల కూల్చేసిన భవనాలకు లోన్స్ ఇచ్చిన బ్యాంకుల జాబితాను కూడా హైడ్రా సిద్ధం చేస్తుంది. ఇలా జలాశయాల సమీపంలో నిర్మాణాలకు .. రుణాలు ఇవ్వడం పై ఏవీ రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువుతో పాటు .. మొత్తం 8 ఎకరాలలో ఉన్న అనేక భవనాలను కూడా తొలగించారు. కనీసం ఇంటి లోని సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా.. అధికారులు క్షణాల్లో భవనాలను నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యులు ఆవేదన అంతా ఇంతా కాదు. అప్పులు చేసి.. చిన్న వ్యాపారాలు చేసుకునే వారు లక్షల్లో నష్టపోతున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ విషయంలో హైడ్రా ఇంకా ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందో చూడలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.